Begin typing your search above and press return to search.
ఓడినా ఓట్లు మాత్రం వచ్చాయే
By: Tupaki Desk | 9 Nov 2015 5:30 AM GMTబీహార్ ఎన్నికల ఫలితాలు బీజేపీని విపరీతంగా బాధిస్తున్నాయి. ఇప్పుడా పార్టీ తీవ్ర నిరాశ.. నిస్పృహలతో కొట్టుమిట్టాడుతోంది. మోడీ మేజిక్ చేసేస్తారని.. ఆయన కానీ తలుచుకుంటే ఎంతటి అసాధ్యమైనా సుసాధ్యంగా మారిపోతుందన్న దానికి భిన్నంగా మోడీ మేజిక్ పని చేయటం మానేసిందన్న భావన కమలనాథుల్లో పెరుగుతోంది.
మొన్నా మధ్య జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ దారుణమైన ఓటమి చెందిన.. బీహార్ ఫలితంతో అయినా కాస్త కోలుకుందామన్న బీజేపీ నేతల ఆశల మీద బీహార్ ప్రజలు నీళ్లు పోశారు. దారుణమైన పరాజయాన్ని మిగిల్చిన బీహార్ ఎన్నికల ఫలితాలు విశ్లేషిస్తే.. ఒక సంతోషకరమైన అంశం కనిపిస్తుంది.
మామూలుగా అయితే.. దీనికి కమలనాథులు సంతోషపడేవారేమో కానీ.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అలాంటిది కనిపించటం లేదు. సీట్ల విషయంలో దారుణంగా వెనుకబడినప్పటికీ.. ఓట్ల శాతం మాత్రం పెరగటం బీజేపీకి సంబంధించి సానుకూలాంశంగా చెప్పొచ్చు. 2010లో నితీశ్ తో జతకట్టి.. పోటీ చేసిన బీజేపీ ఈసారి అందుకు భిన్నంగా సొంత కుంపటి పెట్టుకోవటం తెలిసిందే.
నితీశ్ తో జతకట్టిన సమయంలో వచ్చిన ఓట్ల శాతంతో పోలిస్తే.. తాజా ఎన్నికల్లో బీజేపీకి పడిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అయితే.. గెలుపును డిసైడ్ చేసే సీట్ల విషయంలో మాత్రం భారీ నిరాశే కలిగింది. తాజా ఎన్నికల్లో మహా కూటమిగా బరిలోకి దిగిన జేడీయూ.. ఆర్జేడీ.. కాంగ్రెస్ లు మూడు.. 2010లో వేర్వేరుగా పోటీ చేశాయి. 2010 లెక్కలు చూస్తే.. ఈ మూడు పార్టీలకు కలిపి 49.8 శాతం ఓట్లు వచ్చాయి. కానీ.. తాజా ఫలితాల్ని విశ్లేషిస్తే.. ఈ మూడు పార్టీల కూటమికి వచ్చిన ఓట్లు 41.9 శాతం మాత్రమే. అంటే.. దాదాపు 8 శాతం ఓట్లు మూడు పార్టీలు కలిపి కోల్పోయాయన్న మాట.
అదే సమయంలో 2010 ఎన్నికల్లో బీజేపీ..ఎల్జేపీలు కలిసి 24 శాతం ఓట్లు సాధిస్తే.. ఈసారి అందుకు భిన్నంగా ఒక్క బీజేపీనే సొంతంగా 24.8 శాతం ఓట్లు సాధించటం గమనార్హం. 2010తో పోలిస్తే ఓట్ల పరంగా వృద్ధి సాధించినా.. సీట్ల పరంగా 2010తో పోలిస్తే.. పెద్ద సంఖ్యలో సీట్లు కోల్పోవటం కమలనాథుల్ని కుంగదీస్తోంది.