Begin typing your search above and press return to search.
హైదరా 'బాదీ'.. మళ్లీ అదే నిర్లక్ష్యం..
By: Tupaki Desk | 7 Dec 2018 10:30 AM GMTతెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ పోటెత్తుతోంది. పల్లెలు - పట్నాల్లో ఓటర్లు పోలింగ్ బూతుల వద్ద క్యూలు కట్టారు. పల్లెల్లోనైతే ఓటర్లు ఉత్సాహం చూపిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు తెలంగాణ వ్యాప్తంగా 59శాతం పోలింగ్ నమోదైంది.. కానీ చదువుకున్న వారు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ లో మాత్రం పోలింగ్ శాతం 35శాతానికి మించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
అక్షరాస్యత శాతం తక్కువున్న గ్రామీణ ప్రజానీకంలో చైతన్యం వెల్లివిరిసి 60శాతానికిపైగా ఓటింగ్ నమోదు అవుతుండగా.. చదువుకున్న వారున్న హైదరాబాద్ లో మాత్రం వరుస సెలవులతో సినిమాలు - షికారులు - షాపింగ్ లు - టూర్లతో నగర వాసులు బిజీగా ఉన్నారు. ఇక పోలింగ్ సందర్భంగా హైదరాబాద్ లోని ఐమ్యాక్స్ షో లు రద్దు చేయగా ప్రేక్షకులు ధర్నా చేయడం విశేషం. ఓటేయకుండా సినిమాల్లో యువత కనిపించడం అందరినీ ఆగ్రహానికి గురిచేస్తోంది.
ఇక శుక్రవారం నుంచి శని ఆదివారాలు సెలవు కావడంతో హైదరాబాదీలంతా హాలీడే ఎంజాయ్ చేయడానికి నగరాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. జీహెచ్ ఎంసీ పరిధిలో మొత్తం 24 నియోజకవర్గాలున్నాయి. ఇవి తెలంగాణలో అధికారానికి చాలా కీలకమైనవి. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఐటీ, పారిశ్రామిక ప్రాంతాల నియోజకవర్గాల్లో ఓటింగ్ పై ఏమాత్రం ఉద్యోగులు ఆసక్తి చూపడం లేదు. మనకెందుకులే అన్న నిర్లక్ష్యం హైదరాబాదీ యువతలో కనిపిస్తోంది. హైదరాబాద్ లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని.. ఇక్కడి వారి బద్దకంతో సరైన తీర్పు రావడం లేదని కొందరు ప్రజాస్వామ్యవాదులు విమర్శలు కురిపిస్తున్నారు.