Begin typing your search above and press return to search.

సీఎం భార్యను మేసేజ్ లతో వేధించాడు

By:  Tupaki Desk   |   15 July 2015 8:42 PM GMT
సీఎం భార్యను మేసేజ్ లతో వేధించాడు
X
ఆమె అలాంటి ఇలాంటి వ్యక్తి కాదు.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సతీమణి. అంతేకాదు.. ఆమె ఒక ఎంపీ కూడా. అలాంటి ఆమెకు ఎదురైన పరిస్థితి వింటే విస్మయం కలగక మానదు.ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ మహిళకు రక్షణ లేదన్న భావన కలగటం ఖాయం. చాలా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొని.. చివరకు ఆమె బయటపడక తప్పలేదు. ఇంతకాలం సామాన్య మహిళకే రక్షణ లేదనుకున్నాం కానీ.. చివరకు ముఖ్యమంత్రి సతీమణికి కూడా ఇలాంటి ఇబ్బందులు తప్పటం లేదని తాజా ఉదంతం చూస్తి ఇట్టే అర్థమవుతుంది.

అత్యాచారాలకు.. అకృత్యాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ.. మహిళలపై దారుణాలకు సంబంధించిన వార్తలతో కనిపించే ఉత్తరప్రదేశ్ లోనే తాజా ఉదంతం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సతీమని.. ఎంపీ అయినా డింపుల్ యాదవ్ కి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. 22 ఏళ్ల ఒక యువకుడు ఆమె ఫోన్ కి అభ్యంతరకర మెసేజ్ లు పంపాడు. రాంగ్ మెసేజ్ లన్నట్లుగా వదిలేసిన డింఫుల్ కు.. రోజులు గడిచేకొద్దీ దీని తీవ్రత మరింత పెరగటంతో బయట పెట్టాల్సి వచ్చింది. చివరకు పార్టీ యూత్ వింగ్ కు ఈ విషయం తెలియటం.. మరోవైపు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో.. రంగంలోకి దిగారు.

చెత్త మేసేజ్ లతో మానసిక వేదనకు గురి చేసిన వ్యక్తిని పోలీసులుఅరెస్ట్ చేశారు.వివిధ సెక్షన్ల కింద కేసులు బుక్ చేయటం.. ఈ ఉదంతం సోషల్ మీడియాలో ప్రముఖంగా మారింది. సగటు మహిళ సంగతి ఎందుకు? ఇంట్లోని భార్యకు సైతం ఇబ్బందికర పరిస్థితి ఏర్పడటాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ ఎలా సమర్థించుకుంటారో..?