Begin typing your search above and press return to search.
అక్రమ వలసదారులను ఏరేస్తాం...ట్రంప్ కొత్త వార్నింగ్
By: Tupaki Desk | 18 Jun 2019 11:34 AM GMTఅమెరికన్లకే తొలి ప్రాధాన్యం అంటున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరోమారు వలసల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు ముస్లిం దేశాల ప్రజల ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతోపాటు హెచ్ 1బీ వీసాల జారీని కఠినతరం చేస్తున్న ట్రంప్...తాజాగా దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులపై దృష్టిసారించారు. వలసదారులను సమూలంగా దేశం నుంచి బహిష్కరించే చర్యలను వేగవంతం చేసే చర్యల్లో భాగంగా త్వరలో ఇమిగ్రేషన్స్ ఆండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్‌మెంట్ రాబోయే వారాల్లో మిలియన్ల కొద్ది అక్రమ వలసదారులను తమ దేశం నుంచి పంపించివేయనున్నట్లు ట్వీట్ చేశారు. ఈ మేరకు వారికి ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు.
ఓ అంచనా ప్రకారం అమెరికాలో దాదాపు కోటీ పది లక్షల మంది సరైన పత్రాలు లేకుండా ఉంటున్నారు. ఇందులో మూడు లక్షల మంది ఇండియన్-అమెరికన్ లు కూడా ఉంటారని అంచనా. గత ఏడాది, అక్రమవలసదారులు దేశంలో ఏ మూల ఉన్నా.. ఉన్నపళాన అరెస్టు చేసేందుకు లేదా అదుపులోకి తీసుకునేందుకు ఇమ్మిగ్రేషన్ అధికారులకు సర్వాధికారాలు కట్టబెడుతూ డిపార్ట్ మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ మెమో జారీ చేసింది. అక్రమంగా ఉంటున్నవారిని గుర్తించేందుకు సుమారు 15వేల మంది ఇమ్మిగ్రేషన్ ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెంట్లను కూడా నియమించాలని నిర్ణయించింది. ఈ ఆదేశాల అమలును కొద్దికాలం పాటు చూసి చూడనట్లుగా ఉన్న ట్రంప్ తాజాగా తగిన పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్న ప్రతిఒక్కరినీ ఏరి మరీ దేశం నుంచి బహిష్కరించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా ట్వీట్ చేశారు.
``అమెరికాలో సరైన పత్రాలు లేకుండా నివసిస్తున్న మిలియన్ల కొద్ది అమెరికా నుంచి వచ్చే వారంలో పంపించి వేయనున్నాం. వారిని త్వరితగతిన పంపించేందుకు ఇమిగ్రేషన్స్ ఆండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ పనిచేయనుంది.`` అని ట్రంప్ ట్వీట్ చేశారు. వలసలను అరికట్టేందుకు మెక్సికో కఠినంగా వ్యవహరిస్తోందని ట్రంప్ ఈ సందర్భంగా ప్రశంసించారు. ``మెక్సికో దేశంలోని కఠినమైన చట్టాల వల్ల ఆ దేశంలోని వలసలను పూర్తిగా అడ్డుకోవడం సాధ్యమవుతోంది.`` అని తమ పొరుగు దేశానికి కితాబు ఇచ్చారు. కాగా, సేఫ్ థర్డ్ అగ్రిమెంట్ ను మెక్సికోతో కుదుర్చుకునేందుకు ట్రంప్ సర్కారు కృషి చేస్తోంది. దీని ప్రకారం, పౌరసత్వం కోరుతున్న వారిని గ్వాంటెమాలాకు తరలించే అవకాశం ఉంటుంది. ఇదిలాఉండగా, ఇప్పటివరకు ఇమిగ్రేషన్స్ ఆండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అదుపులో ఉన్న అక్రమ వలసదారుల్లో 24 మంది కన్నుమూశారు. వలసవాదుల విషయంలో ట్రంప్ తీరును దేశంలోని డెమోక్రటిక్ పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తుండగా....ఆయన మాత్రం వలసల విషయంలో ప్రధానంగా అక్రమ వలసల విషంయలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. 2020లో జరగనున్న ఎన్నికల్లో వలసలే ప్రధాన ఎజెండాగా మారనుందని తెలుస్తోంది.