Begin typing your search above and press return to search.

జూనియర్ ఎన్టీఆర్ వాగ్ధాటిని జగన్ తట్టుకోగలడా?

By:  Tupaki Desk   |   28 Sep 2021 4:53 AM GMT
జూనియర్ ఎన్టీఆర్ వాగ్ధాటిని జగన్ తట్టుకోగలడా?
X
వైఎస్ హయాంలో రాజమండ్రి ఎంపీగా వెలుగు వెలిగిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఆ తర్వాత కాంగ్రెస్ ఏపీలో కనుమరుగు కావడంతో వేరే పార్టీలోకి వెళ్లకుండా అలానే కనుమరుగయ్యారు. అప్పుడప్పుడూ ఏపీ సమస్యలపై మాట్లాడుతూ అగ్గి రాజేస్తుంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి ఉండవల్లి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

ఏపీలోని పోలవరం చిక్కులు.. నిధుల లెక్కలు చెబుతూ జగన్ సర్కార్ ను నిలదీసే ఉండవల్లి చాలా రాజకీయ అంశాలపై జగన్ సర్కార్ ను నిలదీసే పని పెట్టుకున్నారు. ఇక టీడీపీ రాజకీయంపై కూడా స్పందించాడు.

ప్రస్తుతం ఏపీలో 2024 వరకు జగన్ సీఎం.. ఆయనకు ఢోకాలేదని ఉండవల్లి చెప్పుకొచ్చాడు. చంద్రబాబుకు వయసైపోవడంతో లోకేష్ ను ఫోకస్ చేస్తున్నాడు. కానీ టీడీపీలోని సీనియర్ల గ్రూపు లోకేష్ ను యాక్సెప్ట్ చేయడం లేదని వివరించారు. జూనియర్ ఎన్టీఆర్ రావాలని వారు కోరుతున్నారన్నారు.

ఈ క్రమంలోనే అవసరం అయితే టీడీపీ అధికారంలోకి వస్తుందనుకుంటే ‘లోకేష్-జూనియర్ ఎన్టీఆర్’ను ఇద్దరిని కలిపి రాజకీయం చేయగల సత్తా చంద్రబాబుకు ఉందని ఉండవల్లి హాట్ కామెంట్స్ చేశారు. అవసరం అయితే మోడీతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీచేయగల సత్తా చంద్రబాబుకు ఉంది. ఆయన ఏం చేయడానికైనా వెనుకాడని రాజకీయ మేధావి అని చంద్రబాబుపై ఉండవల్లి నిప్పులు చెరిగారు.

చంద్రబాబుకు ప్రజల్లో ఎంత ఆదరణ ఉందో తెలియదు కానీ.. చంద్రబాబు చేసినంతగా మానుక్యులేటింగ్ ఎవరూ చేయలేరని ఉండవల్లి సంచలన కామెంట్స్ చేశారు. రాజకీయాలను ప్రభావితం చేయడంలో చంద్రబాబును మించి తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ లేరని ఉండవల్లి వివరించాడు. సో వచ్చే 2024లో ఏమైనా జరగొచ్చని ఉండవల్లి అన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ 2024లో వస్తే జనాలు బాగా వస్తారని.. టీడీపీకి హైప్ వస్తుందని ఉండవల్లి చెప్పుకొచ్చారు. పైగా 2009లోనూ ఎన్టీఆర్ వచ్చినా టీడీపీ గెలవలేదన్నారు. నాలుగు పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడ్డా ఎన్టీఆర్ ప్రచారం చేసినా టీడీపీ గెలుపందుకోలేదన్నారు. రాజశేఖర్ రెడ్డినే గెలిచాడన్నారు.

కానీ జూనియర్ ఎన్టీఆర్ ఏపీ రాజకీయాల్లోకి వస్తే అతడంత వక్త మరొకరు లేరని ఉండవల్లి చెప్పుకొచ్చారు. మంచి తెలివితేటలు, వాగ్ధాటి ఆయన సొంతం అని.. జగన్ సైతం ఎన్టీఆర్ వాగ్ధాటికి తట్టుకోలేడని ఉండవల్లి చెప్పుకొచ్చాడు. రాజకీయాల్లోకి వచ్చిన పొలిటీషియన్లలో అంత బాగా మాట్లాడిన వారు మరొకరు లేరని.. అంత చిన్న కుర్రాడైనా బాగా మాట్లాడారని చెప్పుకొచ్చాడు.