Begin typing your search above and press return to search.

ఇంట‌రెస్టింగ్!..వీవీ వినాయ‌క్ ఇంటికి జ‌గ‌న్‌!

By:  Tupaki Desk   |   2 Jun 2019 7:31 AM GMT
ఇంట‌రెస్టింగ్!..వీవీ వినాయ‌క్ ఇంటికి జ‌గ‌న్‌!
X
ఏపీ ఎన్నిక‌ల్లో బంపర్ విక్ట‌రీ కొట్టిన వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి... న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ నూత‌న ముఖ్యమంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగు చూస్తున్నాయి. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డే దాకా సినిమా రంగంతో జ‌గ‌న్ కు ఉన్న అనుబంధాలు అంత‌గా బ‌య‌ట‌కు రాకున్నా... స‌రిగ్గా ఎన్నిక‌ల వేళ‌... సినిమా ఇండ‌స్ట్రీలో చాలా మంది జ‌గ‌న్ ద‌రికి చేర‌డం ఆస‌క్తిని రేకెత్తించింది. ఇలా జ‌గ‌న్ ను క‌లిసిన వారిలో క‌లెక్ష‌న్ కింగ్ మంచు మోహ‌న్ బాబుతొ పాటు చాలా మంది సినీ ప్ర‌ముఖులే ఉన్నారు. ఇలాంటి విష‌యాలు ఎన్నిక‌లు ముగిసేనాటికే అయిపోలేదు. ఇప్పుడు వైసీపీలోకి ఓ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు చేరడం ఖాయ‌మేనన్న వాద‌న వినిపిస్తోంది. ఆయ‌న మ‌రెవ‌రో కాదు టాలీవుడ్ లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు వీవీ వినాయ‌క్‌. నిజ‌మా? అంటే... డైరెక్ట్ గా కాకుండా కాస్తంత ఇన్‌డైరెక్ట్ గానే అయినా స్వ‌యంగా వీవీ వినాయ‌కే ఈ విష‌యాన్ని వెల్ల‌డించిన త‌ర్వాత నిజ‌మేన‌ని ఒప్పుకోవాల్సిందే క‌దా.

వైఎస్ జ‌గ‌న్ తో త‌న‌కు వ్య‌క్తిగ‌త సంబంధాలు ఉన్నాయ‌న్న విష‌యాన్ని వినాయ‌క్ ఆస‌క్తిక‌రంగా చెప్పుకొచ్చారు. ఓ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌న సినీ ప్ర‌స్థానానికి సంబంధించిన విష‌యాల‌తో పాటు జ‌గ‌న్ ఫ్యామిలీతో త‌మ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని కూడా వివ‌రించారు. ఓ సంద‌ర్భంలో జ‌గ‌న్ త‌మ ఇంటికి వ‌చ్చిన విష‌యాన్ని కూడా వినాయక్ రివీల్ చేసి ఆస‌క్తి రేకెత్తించారు. భ‌విష్య‌త్తులో తాను కూడా రాజ‌కీయాల్లోకి వ‌చ్చేస్తాన‌ని, అందుకు కాస్తంత స‌మ‌యం ప‌ట్టినా... పొలిటిక‌ల్ ఎంట్రీ మాత్రం త‌ప్ప‌దన్న కోణలో వినాయ‌క్ ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పుకొచ్చారు. ఇప్ప‌టికే ఓ సారి అవకాశం వ‌చ్చినా ప‌రిస్థితులు అనుకూలించ‌క వెన‌క‌డుగు వేశాన‌ని - భ‌విష్య‌త్తులో మాత్రం త‌ప్ప‌నిస‌రిగ పొలిటిక‌ల్ ఎంట్రీ ఉంటుంద‌న్న కోణంలో వినాయ‌క్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ఈ దిశ‌గా వినాయ‌క్ ఏం చెప్పార‌న్న విష‌యానికి వ‌స్తే... *ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి అయిన జగన్‌ గారికి శుభాకాంక్షలు. మా నాన్నగారు వైఎస్ రాజశేఖరరెడ్డిగారిని అభిమానించేవారు. రాజకీయాల్లో మా నాన్న‌గారు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు మా తమ్ముడు సురేంద్ర వైసీపీలో యాక్టివ్‌గా ఉన్నారు. నేనూ జగన్ మోహన్‌ రెడ్డి గారిని కలిశా. మా అమ్మ చనిపోయినప్పుడు మా ఇంటికి జగన్ మోహన్‌ రెడ్డిగారు వచ్చారు. ఒక సమయంలో రవీందర్‌ రెడ్డి గారు( వైఎస్ బావమరిది - యోగి నిర్మాత) ‘పోటీ చేద్దువుగానీ’ అని అన్నారు. కానీ అంత శక్తి లేక వెనక్కి తగ్గా. అప్పట్లో మా అమ్మ కూడా అందుకు ఒప్పుకోలేదు. వద్దురా.. మీ నాన్న రాజకీయాల్లో తిరిగి డబ్బు పోగొట్టుకోవడంతో మీ చిన్నప్పుడు మీకు ఏమీ చేయలేకపోయాం. అందుకే మీ పిల్లలు ఎదిగాక ఆలోచిద్దాం. పిల్లలను సెటిల్‌ చేసిన తర్వాత మీ ఇష్టాలన్నీ తీర్చుకోండి. ఇప్పుడు వద్దు అని ఎడ్యుకేట్‌ చేసింది. అందుకే వద్దని చెప్పా. భవిష్యత్తులో ఆలోచిస్తా* అని వినాయక్ తెలిపారు. అంటే... త్వ‌ర‌లోనే వినాయ‌క్ వైసీపీలో చేరిపోయినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌న్న మాట‌.