Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తికి ప్ర‌ముఖులు ఎలా వ‌చ్చారంటే..?

By:  Tupaki Desk   |   22 Oct 2015 6:03 AM GMT
అమ‌రావ‌తికి ప్ర‌ముఖులు ఎలా వ‌చ్చారంటే..?
X
అమ‌రావ‌తి శంకుస్థాప‌న కార్య‌క్ర‌మానికి అతిర‌థ మ‌హార‌థులు విచ్చేశారు. అత్యంత శ‌క్తివంత‌మైన ప్ర‌ముఖులు ఒకేచోట చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఎవ‌రికి వారు త‌మ‌దైన ప్ర‌త్యేక‌త‌తో వేదిక వ‌ద్ద‌కు రావటం క‌నిపించింది. ఇక‌.. వేర్వేరు స‌మ‌యాల్లో.. వేర్వేరుగా వ‌చ్చిన ప్ర‌ముఖుల్ని వివిధ ర‌కాల వాహ‌నాల్లో స‌భా ప్రాంగ‌ణానికి తీసుకొచ్చారు.

= తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌భా ప్రాంగ‌ణానికి త‌న తెల్ల‌రంగు కార్ల కాన్వాయ్ లో చేరుకున్నారు.

= తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ తో పాటు.. ఉప ముఖ్య‌మంత్రి మ‌హ‌మూద్ అలీ.. మంత్రులు జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి.. ఈటెల రాజేంద‌ర్ వ‌చ్చారు.

= ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యులు మొత్తం మూడు బ‌స్సుల్లో గ‌న్న‌వ‌రం ఎయిర్‌ పోర్ట్ నుంచి బ‌య‌లుదేరి స‌భాస్థ‌లి వ‌ద్ద‌కు చేరుకున్నారు.

= న‌ల్ల క‌ళ్లాద్దాలు.. భుజానికి బ్యాగ్ తో బాల‌య్య‌బాబు కొత్త గెట‌ప్ లో ద‌ర్శ‌న‌మిచ్చారు.

= రామోజీ సంస్థ‌ల అధినేత రామోజీ రావు త‌న‌దైన వైట్ అండ్ వైట్ లో వ‌చ్చారు.

= ఆయ‌న‌కు టీడీపీ నేత‌లు సాద‌రంగా ఆహ్వానించి వెంట పెట్టుకొని తీసుకెళ్లారు.

= రామోజీ కుమారుడు ఈనాడు ఎండీ కిర‌ణ్‌.. వేరుగా స‌భాస్థ‌లికి చేరుకున్నారు.

= గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్ట్‌ కి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ చేరుకున్నారు. మోడీకి స్వాగ‌తం ప‌లికేందుకు ప్రోటోకాల్ లో భాగంగా ఉండిపోయారు.

= గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్ట్ కి చంద్ర‌బాబు చేరుకున్నారు. ప్ర‌ధాని మోడీకి స్వాగ‌తం ప‌లికేందుకు ఆయ‌న వెయిట్ చేస్తున్నారు.

= శంకుస్థాప‌న కార్య‌క్రమంలో చంద్ర‌బాబు కుమారుడు లోకేశ్ సెంట‌ర్ ఆఫ్ ద అట్రాక్ష‌న్ గా నిలిచారు.

= ఆయ‌న‌కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్ర‌ముఖులు సైతం పోటీ ప‌డ‌టం గ‌మ‌నార్హం.

= లోకేశ్ వెంట సీఎం ర‌మేష్‌.. ఢిల్లీలో టీడీపీ ప్ర‌తినిధి కంభంపాటి రామ్మోహ‌న్‌రావుతోపాటు ప‌లువురు ఉన్నారు.

= లోకేశ్ షేక్ హ్యాండ్ కోసం టీవీ9 సీఈవో ర‌విప్ర‌కాశ్.. ఎన్ టీవీ అధినేత‌లు వెయిట్ చేయ‌టం క‌నిపించింది.

Buy Bricks Online and Contribute to Amaravathi : http://amaravati.gov.in/EBRICKS/Index.aspx