Begin typing your search above and press return to search.

కేసీఆర్ నాలుక కోస్తే కోటి రూపాయలు.. దుమారం

By:  Tupaki Desk   |   9 Feb 2022 4:51 PM GMT
కేసీఆర్ నాలుక కోస్తే కోటి రూపాయలు.. దుమారం
X
కేసీఆర్ రాజేసిన మాటల మంటలు చల్లారడం లేదు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాట్లాడిన కేసీఆర్ ఈ క్రమంలోనే ‘రాజ్యాంగాన్ని మార్చాలన్న’ కేసీఆర్ డిమాండ్ చిచ్చు రేపింది. దీనిపై బీజేపీ, దళితసంఘాలు, కొన్ని పార్టీలు భగ్గుమన్నాయి. ఈ క్రమంలోనే కేసీఆర్ పై ఇప్పుడు అందరూ విరుచుకుపడుతున్నారు.

తాజాగా ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ ఐక్యవేదిక జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ వాఘ్మారే... కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ సీఎంపై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. హైదరాబాద్ లో ఇవాళ మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్ నాలుక కోసిన వారికి కోటి రూపాయలు బహుమతిగా ఇస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు..కేసీఆర్ కు దమ్ము, ధైర్యం ఉంటే రాజీనామా చేసి రాజ్యాంగం మారుస్తాననే నినాదంతో ఎన్నికల్లోకి వెళ్లాలని సూచించారు.

ఇక భరత్ మరో లాజిక్ బయటకు తీశారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఒక్కసారైనా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి, వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారా? అని ప్రశ్నించారు. అసలు అంబేద్కర్ అంటే కేసీఆర్ కు గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పరిస్థితులకు అనుగుణంగా సవరణలు చేసుకోవచ్చని భారత రాజ్యాంగంలోనే ఉందని భరత్ గుర్తు చేశారు.ఇప్పటివరకూ 130 సార్లు రాజ్యాంగాన్ని సవరించారని.. ఇలాంటిది ఏకంగా రాజ్యాంగానే మారుస్తామనడం సీఎం కేసీఆర్ అహంకారానికి నిదర్శనం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే అంబేద్కర్ విగ్రహం వద్ద ముక్కు నేతలకు రాసి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.