Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్ మెట్రోను మోడీ స్టార్ట్ చేయ‌రా?

By:  Tupaki Desk   |   15 Nov 2017 7:35 AM GMT
హైద‌రాబాద్ మెట్రోను మోడీ స్టార్ట్ చేయ‌రా?
X
లక్ష‌లాది మంది భాగ్య‌న‌గ‌ర వాసులే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగువారు సైతం ఎంతో ఆస‌క్తిగా హైద‌రాబాద్ మెట్రో కోసం ఎదురుచూస్తున్నారు. ఏళ్ల‌కు ఏళ్లుగా సాగుతున్న ఈ నిరీక్ష‌ణ ఈ నెల 28 తో తెర ప‌డ‌నుంది. హైద‌రాబాద్ మెట్రో ప్రారంభం కోసం ప్ర‌ధాని మోడీ తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ రెండు నెల‌ల కంటే ముందే లేఖ రాసి ఆహ్వానించారు.

ఈ ఆహ్వానంపై ఇప్ప‌టివ‌ర‌కూ మోడీ స్పందించింది లేదు. ఈ నెల 28న హైద‌రాబాద్ మెట్రో కోసం కాకున్నా.. హైదరాబాద్ లో జ‌ర‌గ‌నున్న గ్లోబ‌ల్ బిజినెస్ స‌మ్మిట్ కు హాజ‌రు కానున్నారు. అమెరికా అధ్య‌క్ష‌డు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ అమెరికా అధ్య‌క్షుడి స‌ల‌హాదారు హోదాలో న‌గ‌రానికి వ‌స్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే హైద‌రాబాద్ మెట్రో రైల్‌ను ప్ర‌ధాని ప్రారంభించ‌టానికి ఎలాంటి అడ్డంకులు లేవు.

కానీ.. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. రెండు నెల‌ల‌కు ముందే తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు మెట్రో ప్రారంభానికి అనుమ‌తి కోర‌గా ఇప్ప‌టివ‌ర‌కూ స్పంద‌న లేదు. సాధార‌ణంగా ఏదైనా ఆహ్వానం పంపిన వెంట‌నే.. పీఎంవో స్పందించి రియాక్ట్ అవుతుంటారు.

అలాంటిది ఒక ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌డుతున్న ప్రాజెక్టును ప్రారంభించ‌టానికి ఆహ్వానం పంపితే వెంట‌నే స్పందించ‌టం పీఎంవో క‌నీస బాధ్య‌త‌. కార‌ణం బ‌య‌ట‌కు రావ‌టం లేదు కానీ.. పీఎంవో నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ తెలంగాణ స‌ర్కారుకు ఎలాంటి స‌మాచారం రావ‌టం లేదు. ఈ నేప‌థ్యంలో మోడీ హైద‌రాబాద్ రావ‌టం ప‌క్కానే అయిన‌ప్ప‌టికీ మెట్రో రైలు ప్రారంభోత్స‌వం ఎలా జ‌రుగుతుంద‌న్న‌దే ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

బిజినెస్ స‌మ్మిట్ కోసం వ‌చ్చే మోడీ మాదాపూర్ లోని హెచ్ ఐసీసీ కి వెళ‌తారు. అక్క‌డ నుంచి మెట్రో రైలు ప్రారంభానికి మియాపూర్ వ‌స్తార‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు ఆశిస్తున్నాయి. అయితే.. ప్రాక్టిక‌ల్ గా ఎంత‌వ‌ర‌కూ సాధ్య‌మ‌న్న దాని మీద ఎవ‌రూ మాట్లాడ‌టం లేదు. అయితే.. మెట్రో ప్రారంభానికి మియాపూర్‌కు రాక‌పోయే ప‌రిస్థితుల్లో కానీ మోడీ ఉంటే.. రిమోట్ సాయంతో హెచ్ ఐసీసీ నుంచే ప్రారంభిస్తార‌ని చెబుతున్నారు. మెట్రో ప్రారంభానికి ప్ర‌ధాని రాక‌పై ఇప్ప‌టివ‌ర‌కూ త‌మ‌కు ఎలాంటి స‌మాచారం అంద‌లేద‌న్న మాట‌ను ఇటీవ‌ల తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర మంత్రి కేటీఆర్ చెప్ప‌టం తెలిసిందే.

ఇలాంటి వేళ‌.. ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ పీఎంవోను సంప్ర‌దించింది. ఇంత‌కీ హైద‌రాబాద్ మెట్రో మీద ప్ర‌ధాని అభిప్రాయం ఏమిటి? ఆయ‌న వ‌స్తున్నారా? అన్న విష‌యాల్ని ఆరా తీసింది. దీనికి వారిచ్చిన స‌మాధానం ఏమిటంటే.. హైద‌రాబాద్ మెట్రో ప్రారంభానికి మోడీ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని.. ఈ విష‌యం మీద చ‌ర్చ‌లు ఇంకా జ‌రుగుతున్న‌ట్లుగా పేర్కొన్నారు. గ్లోబ‌ల్ అంత్ర‌ప్రెన్యూర్ షిప్ స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యే ప్ర‌ధాని మెట్రోకు హాజ‌రు కావాల్సిన నేప‌థ్యంలో విదేశీ మంత్రిత్వ శాఖ‌తో చ‌ర్చ‌లుజ‌రుగుతున్నాయ‌ని.. మ‌రో రెండు మూడు రోజుల్లో ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న వ్య‌వ‌హారాలు ఖ‌రారు అవుతాయ‌ని చెబుతున్నారు. మెట్రోప్రారంభానికి మోడీకి వ‌చ్చే విష‌యంపై రాష్ట్రానికి క్లారిటీ వ‌స్తుంద‌ని చెబుతున్నారు. చూస్తుంటే.. మెట్రో ప్రారంభానికి కొద్ది రోజుల ముందు మాత్ర‌మే మోడీ ప‌ర్య‌ట‌న మీద క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.