Begin typing your search above and press return to search.

ఫేస్ బుక్ నెత్తిన మరో పిడుగు వేసిన వాల్ స్ట్రీట్

By:  Tupaki Desk   |   1 Sep 2020 1:30 AM GMT
ఫేస్ బుక్ నెత్తిన మరో పిడుగు వేసిన వాల్ స్ట్రీట్
X
గతంలోలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. అది మంచైనా.. చెడైనా ఎక్కువ కాలం దాచటం కష్టం. ఒకప్పుడు మీడియా మొత్తాన్ని కమ్యునిస్టులు కబ్జా చేసిన వైనం ప్రపంచానికి తెలీయటానికి.. అర్థం చేసుకోవటానికి దశాబ్దాలు పడితే.. ఇప్పుడు అలాంటివి చాలా త్వరగా బయటకు వచ్చేస్తున్నాయి. మీడియాను మించి శక్తివంతంగా మారటమే కాదు.. ప్రజల్ని ప్రభావితం చేయటంలో సోషల్ మీడియా ఒక ఆయుధంగా మారిందని చెప్పక తప్పదు. సోషల్ మీడియాలోని చీకటి కోణాలు ఈ మధ్యన ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇలాంటిదే ప్రఖ్యాత మీడియా సంస్థ వాల్ స్ట్రీట్ ఓ సంచలన కథనాన్ని అచ్చేయటం తెలిసిందే.

భారతదేశంలో అధికార బీజేపీకి ఫేస్ బుక్ అనుకూలంగా పని చేస్తుందన్న విషయాన్ని బయటపెట్టటం తెలిసిందే. సంఘ్ పరివార్ కు.. బీజేపీకి ఫేస్ బుక్ భయపడిందన్న విషయాన్ని ఆ మీడియా సంస్థ పేర్కొంది. దీనికి సంబంధించిన ఒక కథనాన్ని ప్రచురించి పెను సంచలనానికి తెర తీసింది. ఈ వ్యవహారంలో ఫేస్ బుక్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్ అంకితాదాస్ మీద పలు ఆరోపణల్ని చేయటం పెద్ద చర్చకు కారణమైంది.

తాను చేసిన ఆరోపణలకు సంబంధించి ఫేస్ బుక్ తన తాజా కథనంలో మరిన్ని అంశాల్ని తెర మీదకు తీసుకొచ్చింది. అంకితాదాస్ మీద తాము చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాల్ని బయటపెట్టటం ద్వారా.. మరో సంచలనానికి కారణంగా మారింది. ఫేస్ బుక్ తన పాలసీకి భిన్నంగా బీజేపీ ద్వేష పూరిత ప్రసంగాలపై అంకితాదాస్ భిన్నమైన తీరును ప్రదర్శించారని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాల్ని బయటపెట్టింది. 2014లో బీజేపీ గెలుపునకు ముందు రోజు అంకితాదాస్ పంపిన ఒక సందేశాన్నిబయటపెట్టింది.

‘‘మేం సోషల్ మీడియాలో ప్రచారాన్ని ప్రారంభించాం. ఆ తర్వాత ఏం జరిగిందన్నది చరిత్రే’’ అని ఆమె పోస్టు చేసినట్లుగా వెల్లడించింది. అంతేకాదు.. మరో సందేశంలో ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసిస్తూ భారతదేశంలోని సోషలిజాన్ని పెకిలించి వేయటానికి ముప్ఫైఏళ్లు పట్టిందంటూ పోస్టు పెట్టారని పేర్కొంది. తాజా కథనం మరోసారి రాజకీయ రగడకు కారణంగా మారుతుందని చెప్పక తప్పదు.