Begin typing your search above and press return to search.

మోడీపై వాల్ స్ర్టీట్ జర్నల్ కామెంట్ అదిరింది..

By:  Tupaki Desk   |   24 Dec 2016 9:27 AM GMT
మోడీపై వాల్ స్ర్టీట్ జర్నల్ కామెంట్ అదిరింది..
X
పెద్దనోట్ల రద్దుతో దేశం రోడ్డున పడి 46 రోజులు దాటినా పరిస్థితి అదుపులోకి రావడం లేదు. ప్రతి ఒక్కరూ మోదీ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మీడియా కూడా భారత్‌ లో పరిస్థితులపై ఘాటుగా కథనాలు రాస్తున్నాయి. మోదీ నిర్ణయం ప్రపంచానికి ఒక భయానకమైన ఉదాహరణను మిగిల్చిందని పలు అంతర్జాతీయ ప్రసిద్ధ పత్రికలు అభిప్రాయపడ్డాయి. ఫోర్బ్స్‌ పత్రిక ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ స్టీవ్‌ ఫోర్బ్స్‌ శుక్రవారం రాసిన ఎడిటోరియల్‌ లో… మోదీ చర్యను సంజయ్‌ గాంధీ హయాంలో జనాభా నియంత్రణకు అమలు చేసిన బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లతో పోల్చిన సంగతి తెలిసిందే. ల్చారు. సంజయ్‌ గాంధీ ఉదంతం తర్వాత ఇప్పటి నోట్ల రద్దు వరకు భారత ప్రభుత్వాలేవీ ఆ స్థాయి అనైతిక నిర్ణయాలు తీసుకోలేదని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా మరో అంతర్జాతీయ పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ కూడా మోడీ నిర్ణయాన్ని ఏకి పడేసింది. బ్రహ్మాండమైన సెటైర్ వేసి పరువు తీసేసింది.

ఫార్ములా వన్ రేసులో మోడీ ఎడ్లబండిని పోటీకి పెట్టారని వ్యాఖ్యానించింది. వేగంగా వెళ్లడం లేదని ఎడ్లను చర్నకోలతో బాదినట్టుగా మోదీ ప్రభుత్వ తీరు ఉందని వాల్‌ స్ట్రీట్ జర్నల్ వ్యాఖ్యానించింది. నోట్ల రద్దును ఆ పత్రిక విపరీత చర్యగా అభివర్ణించింది. భారతలో 95 శాతం లావాదేవీలు నగదులోనే కొనసాగుతాయని గుర్తుచేసింది. అడ్డగోలు నిబంధనలతో వ్యాపారాలను ప్రభుత్వమే దెబ్బతీస్తోందని వ్యాఖ్యానించింది.

అసలు ఇండియాలో ఆర్థిక వ్యవస్థ కట్టుతప్పడానికి కారణమేంటన్నదీ విశ్లేషించింది. ఇష్టానుసారం పన్నులు వేయడం, అడ్డగోలుగా నిబంధనలు పెట్టడం వల్లే భారత్‌లో చాలా వ్యాపారాలు చట్టానికి దూరంగా రహస్యంగా నడుస్తున్నాయన్నారు. జర్మనీలో ఇప్పటికీ 80 శాతం నగదు లావాదేవీలేననీ, అమెరికాలో 32 శాతం నగదు లావాదేవీలు కొనసాగుతున్నాయని గుర్తుచేసింది. క్యాష్‌లెస్‌ ఐడియా మంచిదే అయినా రాత్రికి రాత్రి బలవంతంగా రుద్దడం వల్ల సాధ్యం కాదని పేర్కొంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/