Begin typing your search above and press return to search.

కేటీఆర్ ఆగ్రహం.. కానిస్టేబుల్ సస్పెండ్..!

By:  Tupaki Desk   |   3 April 2020 7:10 AM GMT
కేటీఆర్ ఆగ్రహం.. కానిస్టేబుల్ సస్పెండ్..!
X
కరోనా వైరస్ ను అరికట్టడానికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. అయితే , ఈ లాక్ డౌన్ సమయంలో కొంతమంది లాక్ డౌన్ నియమాలని అతిక్రమించే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే కొంతమంది పోలీసులు బయటకి వచ్చే వారిని ఇష్టానుసారంగా కొడుతున్నారు. తాజాగా తెలంగాణలోని వనపర్తి జిల్లాలో బైక్‌ పై కుమారిడితో కలిసి బయటకు వచ్చిన వ్యక్తిని చిన్నారి ఎదుటే చితకబాదిన కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. ఓ వ్యక్తి తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసి.. మంత్రి కేటీఆర్ - ఎస్పీ - డీజీపీలకు ట్యాగ్ చేశాడు.

ఇది చూసిన కేటీఆర్.. ఆ కానిస్టేబుల్‌ పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి పోలీసుల వల్ల మొత్తం పోలీసుల కష్టం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. కేటీఆర్‌ ట్వీట్‌ పై స్పందించిన జిల్లా ఎస్పీ అపూర్వ రావు. ఈ ఘటనపై విచారణ చేసి - సంబంధిత కానిస్టేబుల్‌ ను సస్పెండ్ చేస్తూ కఠిన చర్యలు తీసుకున్నారు. అంతేకాక, ఎస్పీ బాధితుడి ఇంటికి వెళ్లి పరామర్శించారు. కాసేపు ఆ బాలుడితో ముచ్చటించారు.

బుధవారం సాయంత్రం వనపర్తికి చెందిన ఓ వ్యక్తి రోడ్డుపై తన కొడుకుతో బైక్‌పై రాకపోకలు సాగించాడు. ఇది గమనించిన పోలీసులు అతన్ని ఆపి లాక్‌ డౌన్‌ సమయంలో బాలుడిని వెంట తీసుకెళ్లడం సరికాదని హెచ్చరించారు. అంతేకాక.. ఆ బైక్‌ పై 14 పెండింగ్ చలాన్లు ఉన్నాయని - అవి కట్టాలని నిలదీశాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో ఘర్షణ చోటుచేసుకుంది. కానిస్టేబుల్ ఆ వ్యక్తిని కుమారుడి ముందే కిందపడేసి కొట్టాడు. కాగా ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో తెలంగాణ మంత్రి కేటీఆర్ దృష్టికి రావడంతో అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రిని - డీజీపీని కోరారు. దీనిపై స్పందించిన వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వారావు వ్యక్తిపై దాడి చేసిన కానిస్టేబుల్‌ పై సస్పెన్షన్ వేటు వేశారు.