Begin typing your search above and press return to search.

ఏపీ స‌చివాల‌యం కంప్యూట‌ర్ల‌లో వాన్న‌క్రై

By:  Tupaki Desk   |   17 May 2017 2:29 PM GMT
ఏపీ స‌చివాల‌యం కంప్యూట‌ర్ల‌లో వాన్న‌క్రై
X
ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న వాన్న‌క్రై వైర‌స్ రెండు తెలుగు రాష్ట్రాల స‌చివాల‌యాల్ని వ‌ణికిస్తోంది. నిన్న‌టికి నిన్న తెలంగాణ స‌చివాల‌యంలోని కొన్ని కంప్యూట‌ర్ల‌కు ఈ వైర‌స్ క‌నిపించిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా.. వెల‌గ‌పూడిలోని ఏపీ స‌చివాల‌యంలోని కంప్యూట‌ర్ల‌లో ఈ వైర‌స్ బారిన ప‌డిన‌ట్లుగా చెబుతున్నారు.

ఏపీ స‌చివాల‌యంలోని ప‌లు కంప్యూట‌ర్లు ప‌ని చేయ‌కుండా మొరాయించ‌ట‌మే కాదు. 300 డాల‌ర్ల బిట్ కాయిన్స్ చెల్లించాల‌న్న మెసేజ్ లు వ‌స్తున్నాయి. దీంతో.. ఏపీ స‌చివాల‌య కంప్యూట‌ర్లు వాన్న క్రై బారిన ప‌డిన‌ట్లుగా అంచ‌నా వేస్తున్నారు.

ప‌లు కంప్యూట‌ర్లు బ్లాక్ కావ‌టంతో ఐటీ అధికారులు రంగంలోకి దిగి.. ఆయా కంప్యూట‌ర్ల హార్డ్ డిస్క్‌ల‌ను రీరైట్ చేస్తున్నారు. అయితే.. ఎన్ని కంప్యూట‌ర్లు ఈ వైర‌స్ బారిన ప‌డ్డాయ‌న్న‌ది క‌చ్ఛితంగా అంచ‌నా వేయ‌లేనప్ప‌టికీ.. భారీగా అయితే సిస్ట‌మ్స్ వైర‌స్ బారిన ప‌డిన‌ట్లుగా చెబుతున్నారు.

వైర‌స్ మ‌రిన్ని కంప్యూట‌ర్ల కు సోకుండా జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లుగా తెలుస్తోంది. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో రాత్రివేళ‌ల్లో స‌చివాల‌యం స‌ర్వ‌ర్ల‌ను ష‌ట్ డౌన్ చేయ‌టం మంచిద‌న్న ఆలోచ‌న‌కు వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. తాజా హ్యాకింగ్ అటాక్ నేప‌థ్యంలో ఐటీ హెడ్స్ మొత్తానికి క‌లిపి ఐటీ శాఖ ఒక వాట్స‌ప్ గ్రూప్‌ను క్రియేట్ చేసి.. ఎక్క‌డెక్క‌డ ఏ కంప్యూట‌ర్లు వైర‌స్ బారిన ప‌డ్డాయ‌న్న విష‌యాన్ని తెలుసుకొని నివార‌ణ చ‌ర్య‌లు చేప‌డుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/