Begin typing your search above and press return to search.
సురేష్ గోపీకి... ఇంత పైత్యమా?
By: Tupaki Desk | 27 Sep 2017 11:47 AM GMTదేశంలో కుల ప్రాతిపదికన ఎప్పుడూ ఏదో ఓక వివాదం రేగుతూనే ఉంది. ఏపీ - తెలంగాణల్లో ప్రొఫెసర్ ఐలయ్య రాజేసిన మంటలు ఇంకా చల్లారలేదు. మొదట కులంగా మొదలైన వివాదం ఇప్పుడు మతానికి పులుముకుని అన్ని వర్ణాలు రోడ్డున పడ్డాయి. తాజాగా... బీజేపీ రాజ్యసభ ఎంపీ - నటుడు సురేష్ గోపి కూడా నోటిదూలను ఆపుకోలేక పోయాడు. ఈ మధ్యే తిరువనంతపురంలో బ్రహ్మణ సంఘాలు నిర్వహించిన యోగక్షేమ సభకు హాజరయ్యారు. అక్కడ ఆయన ప్రసంగించారు.
నిజానికి ఇలాంటి సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తులు ఏం చెబుతారని ఎవరైనా అనుకుంటారు? పదిమందికి మంచి చేసే పనుల గురించి - సంఘసేవ గురించి మాట్లాడతారనే అనుకుంటారు. కానీ, ఈయనకు కూడా పైత్యం పీక్స్ కు వెళ్లింది! మళ్లీ బ్రాహ్మణుడిగానే పుట్టాలని ఉందంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ‘పునర్జన్మ మీద నాకు నమ్మకం ఉంది. జంధ్యం వేసుకునే కులంలో జన్మించా. వచ్చే జన్మలో కూడా ఇదే కులంలో పుట్టాలని కోరుకుంటున్నా. తద్వారా భగవంతుడికి మరింత సేవ చేసుకునే భాగ్యం నాకు కలుగుతుంది’ అంటూ తన ప్రసంగం ముగించాడు.
దీంతో సభకు వచ్చిన బ్రాహ్మణ వర్గం ఆహా ఓహో అంటూ.. ఆకాశానికి ఎత్తేసింది. కానీ, ఆరోజు వరకు ఈ వ్యాఖ్యల తాలూకు నొప్పి తెలియక పోయినా.. తాజాగా మాత్రం సురేష్ గోపీకి సలుపు స్టార్టయింది. ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు రెచ్చిపోతున్నారు. ఓ ఎంపీ అయి ఉండి కుల ప్రస్తావన తేవటంపై మండిపడుతున్నారు. ఆదిమగోపి పేరిట యాష్ ట్యాగ్ ను ఫేస్ బుక్ - ట్విట్టర్ లో వైరల్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్లనా? మనం పార్లమెంట్‌కు పంపింది అని ప్రముఖ పాత్రికేయురాలు ఛార్మీ జయశ్రీ హరికృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇప్పుడు దాదాపు సురేష్ గోపీ మీడియా మైకు చూస్తేనే భయపడుతున్నాడట! నోటి దూల తెచ్చిన తంటా ఇదని తనలో తనే కుమిలిపోతున్నాడట!!