Begin typing your search above and press return to search.

తమిళనాడుకు వెళ్లాలా? ఏపీకి ఒకలా.. తెలంగాణకు మరోలా

By:  Tupaki Desk   |   8 March 2021 7:30 AM GMT
తమిళనాడుకు వెళ్లాలా? ఏపీకి ఒకలా.. తెలంగాణకు మరోలా
X
తమిళనాడుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారా? మీరు కాకున్నా.. మీ కుటుంబ సభ్యులు.. బంధువులు.. స్నేహితులు ఎవరైనా ఉన్నారా? అయితే.. ఇది తప్పనిసరిగా చదవాల్సిందే. ఎందుకంటే.. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. అలా పెరుగుతున్న కేసుల్లో తమిళనాడు రాష్ట్రం ఒకటి. దేశంలో రోజు నమోదయ్యే కేసుల్లో 85 శాతం ఆరు రాష్ట్రాల్లోనే కాగా.. అందులో తమిళనాడు ఒకటి.

ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున కేసులు నమోదువుతున్న వేళ.. తమ రాష్ట్రానికి రావాలనుకునే వారు తప్పనిసరిగా ఈపాస్ తీసుకొని మాత్రమే రావాలని స్పష్టం చేస్తోంది. అయితే.. మూడు రాష్ట్రాల వారికి మాత్రం ఈపాస్ అవసరం లేకుండా వెళ్లే వీలుంది. ఇతర రాష్ట్రాల నుంచి తమిళనాడుకు వెళుతున్న వారి రూపంలో కేసులు పెరుగుతున్నట్లుగా చెబుతున్నారు. దీంతో.. అలెర్టు అయిన రాష్ట్రం.. కొత్త నిబంధనను తెర మీదకు తీసుకొచ్చింది.

ఏపీ.. కర్ణాటక.. పుదుచ్చేరి నుంచి తమిళనాడుకు వెళ్లే వారికి ఎలాంటి ఈ-పాస్ అవసరం లేకుండా మినహాయింపు ఇచ్చింది. మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణతో సహా మిగిలిన అన్ని రాష్ట్రాలవారు తమిళనాడుకు వెళ్లాలంటే.. తప్పనిసరిగా ఈ-పాస్ పొందాల్సి ఉంటుంది. ఇక.. అంతర్జాతీయ విమానాల్ని ఎక్కేందుకు చెన్నైకి వెళ్లాల్సిన వారంతా ముందే.. ప్రభుత్వం నుంచి ఈపాస్ తీసుకున్న తర్వాతే రాష్ట్రంలోకి అనుమతిస్తారన్న విషయాన్ని మర్చిపోకూడదు.