Begin typing your search above and press return to search.
మోడీని కలిసిరావాలె : జగన్ హస్తిన టూర్ వెనక...?
By: Tupaki Desk | 1 Jun 2022 7:42 AM GMTదాదాపు పదకొండు రోజుల పాటు విదేశాల్లో గడిపి నిన్ననే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లి పాలేస్ కి చేరుకున్నారు. ఆయన ల్యాండ్ అయి ఒక్క రోజు కూడా కాలేదు మళ్ళీ చలో ఢిల్లీ అంటున్నారు. అక్కడ ఎన్ని రోజులు ఉంటారో తెలియదు కానీ ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ మాత్రం ఇప్పటికైతే కన్ ఫర్మ్ అయింది.
ఢిల్లీ వైపుగా సాగే తన ప్రత్యేక విమానాన్ని జగన్ 2న తేదీన ఎక్కబోతున్నారు. ఆయన ఢిల్లీ టూర్ కి సంబంధించి ఏర్పాట్లు చకచకా అధికారులు చేస్తున్నారు. మరి ఇంత అర్జంటుగా జగన్ ఢిల్లీ టూర్ చేయడం వెనక రీజన్ ఏంటి అన్నదే అందరిలో కలుగుతున్న డౌటానుమానం.
జగన్ ఢిల్లీ వెళ్ళేది చాలా విషయాలను చర్చించడానికి. అనేక విషయాలలో క్లారిటీ తెచ్చుకోవడానికి అంటున్నారు. వీటిలో ముఖ్యంగా చూస్తే ఏపీకి భారీగా నిధులు అలాగే అప్పులు బాగా కావాలి. ఏపీ చేసే అప్పలకు కేంద్రం అడ్డుపెట్టకుండా చూసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్ అంటున్నారు.
అదే విధంగా పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కూడా జగన్ కేంద్రం మీద మరోమారు వత్తిడి తేబోతున్నారు. పోలవరం ప్రాజెక్టునకు సవరించిన అంచనాల మేరకు పరిపూర్తి చేయాలన్నది జగన్ డిమాండ్. అయితే ఈ విషయంలో కేంద్రం వైఖరి మాత్రం స్పష్టంగా లేదు. వారు అంతా కలిపి ఏ ఇరవై వేల దగ్గరో తెగ్గొట్టేద్దామనే చూస్తున్నారు. కానీ పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కనుక ఏమీ చేయకపోతే రాజకీయంగా ఇబ్బందులు వస్తాయన్నది వైసీపీకి తెలుసు.
అందుకే జగన్ ఈ విషయంలో కేంద్ర పెద్దలతో గట్టిగా మాట్లాడుతారు అంటున్నారు. అదే విధంగా రాష్ట్రపతి ఎన్నికలు వచ్చే నెలలో ఉన్నాయి. ఈ ఎన్నికలలో వైసీపీ మద్దతు బీజేపీకి కచ్చితంగా ఉంటుంది. రెండవ మాటకు అవకాశం లేదు. దాన్ని కూడా క్లారిటీగా చెప్పి ఏపీకి కేంద్రం చల్లను చూపు ఉండాలని కోరుకుంటారు అని అంటున్నారు.
ఇక మరో వైపు చూస్తే ఏపీకి జూన్ నెలలో జాతీయ ప్రెసిడెంట్ జేపీ నడ్డా వస్తున్నారు. ఆయన ఏం మాట్లాడుతారో, బీజేపీ కేంద్ర పెద్దల వైఖరి ఏపీ మీద ఎలా ఉండబోతోంది అన్నది కూడా తెలుసుకోవడానికి కూడా జగన్ ఢిల్లీ టూర్ ఉపయోగపడుతుంది అంటున్నారు. మొత్తానికి ప్రధాని మోడీతో మొదలుపెట్టి అమిత్ షాత్ తో పాటు కేంద్ర మంత్రులను వరసగా సాగే ఈ టూర్ ద్వారా జగన్ మరో మారు హస్తిన టూర్ ని హైలెట్ చేయాలనుకుంటున్నారు. చూడాలి మరి ఢిల్లీ టూర్ లో రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయో.