Begin typing your search above and press return to search.

పార్టీ చేసుకుంటారా..? రైలు బోగీని అద్దెకిస్తార‌ట‌..!

By:  Tupaki Desk   |   20 March 2021 1:30 AM GMT
పార్టీ చేసుకుంటారా..? రైలు బోగీని అద్దెకిస్తార‌ట‌..!
X
పెళ్లిళ్లు, ఇత‌ర‌త్రా ఫంక్ష‌న్ల‌కు ఆర్టీసీ బ‌స్సుల‌ను అద్దెకివ్వ‌డం గురించి మ‌న‌కు తెలుసు. కానీ.. రైలు పెట్టెను అద్దెకివ్వ‌డం గురించి మీకు తెలుసా..? తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి.. ఎన్ని పెట్టెలు కావాలంటే.. అన్ని ఇచ్చేస్తారట! ఈ విష‌యాన్ని అధికారికంగా అనౌన్స్ చేసింది రాజ‌స్థాన్ లోని జైపూర్ మెట్రో మేనేజ్ మెంట్‌!

బ‌ర్త్ డే పార్టీలు, ఇంకా ఏవైనా స్పెష‌ల్ ఈవెంట్లకోసం స్పెష‌ల్ ప్లేస్ కావాల‌ని కోరుకునే వారికి ఆహ్వానం ప‌లుకుతోంది జైపూర్ మెట్రో. మా రైలు పెట్టెలు ఉండ‌గా.. మీకెందుకు చింత అంటూ వెల్కం చెబుతోంది. అంతేకాదు.. మెట్రో స్టేష‌న్ల‌లో బ్యాన‌ర్ల ద్వారా అడ్వ‌ర్టైజ్ మెంట్స్ ఏర్పాటు చేసుకునే ఫెసిలిటీ కూడా క‌ల్పిస్తున్నారు అధికారులు.

క‌రోనా నేప‌థ్యంలో ప‌డిపోయిన ఆదాయాన్ని పెంచుకునేందుకు మార్గాలు అన్వేషించిన అధికారుల‌కు.. ఇదేదో బాగుంద‌నిపించి ఫిక్స్ అయిపోయార‌ట‌. అయితే.. ఎన్ని రోజులు కావాల‌న్నా రెంటుకు ఇస్తారుగానీ.. రెంటు మాత్రం గంట‌ల్లో వ‌సూలు చేస్తారు! ఒక మెట్రో కోచ్ ను మినిమం నాలుగు గంట‌ల‌పాటు రెంటుకు తీసుకోవాల్సి ఉంటుంది.

నాలుగు గంట‌ల‌పాటు రైలు బోగీని ఉప‌యోగించుకుంటే రూ.5 వేలు చెల్లించాలి. ఏదైనా కార‌ణం చేత ఇంకాస్త టైం ఎక్కువ తీసుకుంటే.. ఆటో మీట‌రు లెక్క ఛార్జీ పెరిగిపోతుంది. ఆ త‌ర్వాత ప్ర‌తీ గంట‌కు వెయ్యి రూపాయ‌ల చొప్పున‌ చెల్లించాలి. ఈ లెక్క‌న మీరు ఎన్ని బోగీలు అయినా తీసుకోవ‌చ్చు. క‌న్సెష‌న్ గురించి మాత్రం అడ‌గొద్దు. అస‌లే న‌ష్టాల్లో ఉండే క‌దా.. ఇలాంటి స్కీం పెట్టింది! అద‌న్న‌మాట సంగ‌తి.