Begin typing your search above and press return to search.

హైద‌రాబాదీ స్కెచ్ః ఇండియాపై ఐఎస్ దాడి

By:  Tupaki Desk   |   19 Nov 2015 6:10 AM GMT
హైద‌రాబాదీ స్కెచ్ః ఇండియాపై ఐఎస్ దాడి
X
ఐఎస్ ఐఎస్‌..ప్ర‌పంచాన్ని ముప్పుతిప్ప‌లు పెడుతున్న రాక్ష‌స‌మూక‌. ఇప్ప‌టివ‌ర‌కు భార‌త‌దేశంలో ప్ర‌త్య‌క్ష దాడుల‌కు పాల్ప‌డ‌న‌ప్ప‌టికీ....స‌రిహ‌ద్దులోని జ‌మ్ముకాశ్మీర్‌ లో త‌న ఉనికికి చాటుకుంటోంది. ఇటీవ‌ల పారీస్‌ లో దాడులు జ‌ర‌గ‌డం, ఉగ్ర‌వాదంపై పోరుకు భార‌త్ పూర్తి మ‌ద్ద‌తు ప‌లికిన నేప‌థ్యంలో మ‌న‌దేశంపై ఐఎస్ క‌న్ను ఎలా ఉండ‌బోతుంద‌నే చ‌ర్చ మొద‌యింది. నిఘా వర్గాలు భావించిన‌ట్లే భార‌త్‌ పై ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు దాడి చేయాలని భావించారు. ఇది సాక్షాత్తు ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాది చెప్పాడు.

ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న కారణంగా హైదరాబాద్‌ కు చెందిన సల్మాన్‌ మొహియుద్దీన్‌ అనే ఇంజనీర్‌ ను పోలీసులు గత జనవరిలో అరెస్టు చేశారు. భార‌తీయ మూలాలున్న ఐఎస్ ఉగ్ర‌వాదుల గురించి ఆరాతీస్తుండ‌గా తాజాగా పోలీసులు స‌ల్మాన్‌ ను విచారించారు. ఈ సంద‌ర్భంగా సల్మాన్‌ సాక్ష్యమిస్తూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింల దుస్థితికి కారణం పాశ్చాత్య దేశాలేనని, దీనికి ఇస్లామిక్‌ స్టేట్‌ స్థాపనే పరిష్కారమని భావించినట్లు చెప్పాడు.

సల్మాన్‌ మొహియుద్దీన్ ఏడాది జ‌న‌వ‌రిలో హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌ కు వెళ్లడానికి అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చినప్పుడు అతడిని పోలీసులు అరెస్టు చేశారు. తాను అమెరికాలో పని చేస్తున్న సమయంలో వివక్షకు గురైతే ఇస్లామిక్‌ స్టేట్‌ లో చేరాలనుకున్నానని, ఆ తరువాత భారతపై ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు యుద్ధం చేయాలని భావించానని సల్మాన్‌ చెప్పాడు.