Begin typing your search above and press return to search.

అమెజాన్‌.. ఫ్లిప్ కార్ట్ ల మ‌ధ్య మాటల తూటాలు

By:  Tupaki Desk   |   6 Aug 2015 10:11 AM GMT
అమెజాన్‌.. ఫ్లిప్ కార్ట్ ల మ‌ధ్య మాటల తూటాలు
X
ఈ కామ‌ర్స్ సంస్థ‌ల్లో మొన‌గాడు లాంటి సంస్థ‌ల మ‌ధ్య ఇప్ప‌డు మాట‌లు తూటాల్లా పేలుతున్నాయి. ఇండియాలో తిరుగులేని ఫ్లిప్ కార్ట్‌.. ప్ర‌పంచ వ్యాప్తంగా పేరున్న అమెజాన్ సంస్థ‌ల మ‌ధ్య న‌డుస్తున్న బిజినెస్ వార్‌.. ఇప్పుడు ఒక‌రి మీద ఒక‌రు మాట‌లు అనుకునే వ‌ర‌కు దిగ‌జారింది.

రోజురోజుకీ విస్త‌రిస్తూ.. భారీ మార్కెట్ గా ఉన్న భార‌త ఈ కామ‌ర్స్ రంగంలో భార‌తీయ కంపెనీ అయిన ఫ్లిప్‌ కార్ట్ కు 44 శాతం మార్కెట్ వాటా ఉంటే.. అమెరికాకు చెందిన అమెజాన్‌ కు మాత్రం 14 శాతం వాటేనే ఉంది. ప్ర‌పంచం వ్యాప్తంగా ఈ కామ‌ర్స్ రంగంలో తిరుగులేని అమేజాన్‌కు.. భార‌త్ మార్కెట్ మాత్రం ఒక ప‌ట్టాన అంతుప‌ట్ట‌ని ప‌రిస్థితి.

ఇదిలా ఉంటే.. ఈ రెండు సంస్థ‌ల మ‌ధ్య తాజాగా సోష‌ల్ నెట్క్ వ‌ర్స్క్ లో మాట‌ల యుద్ధం న‌డుస్తోంది. ప్లిఫ్ కార్ట్ కార్యాల‌యంలోని రెసెప్ష‌న్ లో అమేజాన్ కార్ట‌న్ బాక్స్ ఉండ‌టంపై ట్విట్ట‌ర్‌ లో ఒక ఫోటో పోస్ట్ చేశారు. దీనికి వ్యాఖ్య‌గా.. ఫ్లిప్ కార్ట్ ఉద్యోగులు అమేజాన్ మాధ్య‌మంగా త‌మ వ‌స్తువుల్ని బుక్ చేసుకుంటున్నార‌ని పేర్కొన్నారు.

దీనికి కౌంట‌ర్ ఇచ్చిన ప్లిప్ కార్ట్ వ‌ర్గీయులు త‌మ ఆఫీసులో అమేజాన్ బాక్స్ ను డ‌స్ట్ బిన్ గా వాడుతున్న‌ట్లు పేర్కొన్నారు. ఇలా ఆన్ లైన్ లో ఈ రెండు కంపెనీల మ‌ధ్య వాద‌న జోరుగా సాగుతోంది. ఇక‌.. డ‌స్ట్ బిన్‌ వ్య‌వ‌హారంపై ఒక‌రు స్పందిస్తూ.. డ‌స్ట్ బిన్ గా వాడేందుకు బాక్స్ కావాల‌న్నా ఆమేజాన్ నుంచి ఆర్డ‌ర్ చేయాల్సిందేగా? అంటే.. అంటూ న‌ర్మ‌గ‌ర్భంగా మాట‌ల తూటాలు విసురుకుంటున్న ప‌రిస్థితి.