Begin typing your search above and press return to search.

అమెరికా - చైనా మధ్య వార్​ వస్తే.. డ్రాగన్​ గెలుపు ఖాయం..!

By:  Tupaki Desk   |   17 May 2021 10:28 AM GMT
అమెరికా - చైనా మధ్య వార్​ వస్తే.. డ్రాగన్​ గెలుపు ఖాయం..!
X
చైనా ప్రపంచంలోనే సూపర్​ పవర్ గా మారాలని కలలు కంటున్న విషయం తెలిసిందే. నిత్యం తన పొరుగు దేశాలతో కయ్యాలు పెట్టుకుంటూ సంతోషించే చైనా .. తాజాగా అమెరికాతోనే యుద్ధానికి సై అంటూ సంకేతాలు పంపుతోంది. ఇప్పటికిప్పుడు అమెరికాతో యుద్ధం జరిగితే చైనా గెలుపు ఖాయమంటూ గ్లోబల్​ టైమ్స్​ సంపాదకీయం ప్రచురించుంది. ప్రస్తుతం ఈ కథనం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.

చైనా సూపర్​ పవర్​ దేశమంటూ గ్లోబల్​ టైమ్స్ ఈ కథనంలో రాసుకొచ్చింది. నిజానికి గ్లోబల్​ టైమ్స్​.. చైనా కమ్యూనిస్టు పార్టీ అధికారిక పత్రిక.. ప్రస్తుతం సంపాదకీయంలో వివాదాస్పద అంశాలను రాసుకొచ్చింది. ఈ కథనంలో ఇటువంటి కథనం రావడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జపాన్‌ సైనిక విన్యాసాల్లో అమెరికా ప్రమేయాన్ని ప్రస్తావించిన గ్లోబల్‌ టైమ్స్‌.. దక్షిణ జపాన్‌ లో సైనిక విన్యాసం చైనాను ఏమాత్రం ప్రభావితం చేయలేదని పేర్కొంది.

అయితే గ్లోబల్​ టైమ్స్​ కథనాన్ని అమెరికన్‌ నిపుణుడు అలెక్స్‌ మిహైలోవిచ్‌ కొట్టిపారేశారు. చైనాకు ప్రపంచదేశాల నంచి మద్దతు కరువైందని.. అందుకే ఆ దేశం ఇప్పుడు రెచ్చగొట్టేలా తప్పుడు కథనాలు ప్రచురిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.ఇప్పటికే తైవాన్​ తో చైనాకు వార్​ నడుస్తోన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో చైనా తనను తాను సూపర్​పవర్​ గా అభివర్ణించుకొనేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నది. గ్లోబల్​ టైమ్స్ లో నిత్యం వివాదాస్పద కథనాలు వస్తుంటాయి. గతంలో మనదేశం మీద కూడా ఎన్నో తప్పుడు కథనాలు వండి వార్చారు. తాజాగా ఇప్పుడు అమెరికా కంటే చైనానే సూపర్​ పవర్​ అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం.