Begin typing your search above and press return to search.
వెంకాయమ్మకు ఇల్లు విషయంలో వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్య వార్!
By: Tupaki Desk | 15 Jun 2022 10:30 AM GMTఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వ పాలన దరిద్రంగా ఉందంటూ గత నెల 16న గుంటూరు కలెక్టరేట్ లో స్పందన కార్యక్రమం వద్ద కర్లపూడి వెంకాయమ్మ అనే మహిళ మాట్లాడిన మాటలు తీవ్ర స్థాయిలో వైరల్ సంగతి తెలిసిందే. దీనిపై వైఎస్సార్సీపీ, టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామానికి చెందిన దళిత మహిళ వెంకాయమ్మ జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తనకు ఇప్పటివరకు ఇంటి స్థలం రాలేదని, ఇతర పథకాలు కూడా అందలేదని తీవ్ర ఆరోపణలు చేశారు.
దీంతో రెచ్చిపోయిన వైఎస్సార్సీపీ శ్రేణులు గత నెల 17న వెంకాయమ్మ, ఆమె కుమారుడుని చితకబాదారు.. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జగన్ ను విమర్శిస్తే ప్రతిపక్ష నేతలు, మాజీ మంత్రులనే వదిలిపెట్టని జగన్ సర్కార్ వెంకాయమ్మను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు, దాడులకు పాల్పడుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
తాజాగా రెండు రోజుల క్రితం మరోసారి ఆమె కుటుంబంపై వైఎస్సార్సీపీ మూకలు దాడి చేశారని ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. దీనిపై టీడీపీ తాజాగా చలో కంతేరు పేరుతో కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రావడానికి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు బయలుదేరగా జగన్ ప్రభుత్వం ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేసింది. ప్రతిపక్షాలు దీన్ని రాజకీయంగా క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుండటంతో వైఎస్ జగన్ సర్కార్ అప్రమత్తమైంది. వెంకాయమ్మకు తమ ప్రభుత్వమే ఇల్లు ఇస్తుందని.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం ఓ పోస్టర్ ను సోషల్ మీడియాలో వైరల్ చేసింది. ఇల్లు ఇవ్వడం టీడీపీ వల్ల ఎందుకు కాదో.. తమ వల్లే ఎందుకు అవుతుందో గణాంకాలతో సహా ఆ పోస్టర్ లో వివరించింది.
వైఎస్సార్సీపీ ఒక్కసారిగా వెంకాయమ్మ విషయంలో యూటర్న్ తీసుకోవడానికి తాజాగా టీడీపీ విడుదల చేసిన పోస్టరే కారణమంటున్నారు. బెంగళూరు, హైద్రాబాద్, తాడేపల్లి తదితర ప్రాంతాలలో విలాసవంతం అయిన ఇళ్లు ఉన్న జగన్... ఎందుకని పేదలకు ముఖ్యంగా వెంకాయమ్మలాంటి దళితులకు ఇల్లు ఇవ్వలేకపోతోందని టీడీపీ నిలదీస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టర్ విడుదల చేసింది. దీనిపైనే ఇప్పుడు వాదోపవాదాలు నడుస్తున్నాయి.
ఊరికో ప్యాలెస్ కట్టుకుని.. ప్రభుత్వాన్ని చేతిలో పెట్టుకుని, పూరి గుడిసెలో ఉండే వెంకాయమ్మ లాంటి సామాన్య మహిళ అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పలేక, దాడులు చేపిస్తావా జగన్ రెడ్డి ? అని టీడీపీ ఆ పోస్టర్ లో నిలదీసింది. ఆ పోస్టరు వైరల్ అయ్యింది. అలాగే వెంకాయమ్మను, ఆమె కుమారుడిని పోలీసులు నేల మీద కూర్చోబెట్టి ఫిర్యాదు తీసుకోవడంపైనా మండిపడింది. దీనికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో ఒక పోస్టర్ పెట్టింది. ఒక దళిత మహిళలను పోలీసులు బానిసలాగా కింద కూర్చోపెట్టి వేధించడం కరెక్టేనా అని ప్రశ్నించింది.
దీంతో వైఎస్సార్సీపీ అప్రమత్తమైంది. 14 ఏళ్ల తెలుగుదేశం పాలనలో ఆమెకు ఇల్లు రాలేదని.. జగన్ పాలనలో వెంకాయమ్మకు ఇల్లు వస్తుందని వైఎస్సార్సీపీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ చేపట్టిన ఛలో కంతేరు కార్యక్రమాన్ని అడుగడుగునా అడ్డుకుని తీవ్ర విమర్శలు పాలయిన జగన్ ప్రభుత్వం ఈ వివాదాన్ని తమకు అనుకూలంగా మార్చుకోగలమనే ధీమాలో ఉంది. తమ ప్రభుత్వం వెంకాయమ్మను కూడా ఆదుకుంటుందని ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ చెబుతోంది.