Begin typing your search above and press return to search.
ఆంధ్రా, తెలంగాణ మంత్రుల మధ్య మరోసారి మాటల వార్!
By: Tupaki Desk | 14 Nov 2022 12:31 AM GMTఇప్పటికే వివిధ అంశాలపై వైసీపీ, టీఆర్‌ఎస్ మంత్రుల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోమారు తెలంగాణ, ఆంధ్రా మంత్రుల మధ్య మాటల వార్ చోటు చేసుకుంది.
మరో ఐదేళ్లు గడిచినా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేరని తెలంగాణ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. పోలవరం పనుల పురోగతిపై అక్కడి ఇంజనీర్లతో మాట్లాడానని తెలిపారు. మరో ఐదేళ్లలో పోలవరం పనులు పూర్తి చేసినా గొప్పేనని ఇంజనీర్లు తనకు తెలిపారని హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు, ఆంధ్రాలో పోలవరం ప్రాజెక్టు ఒకేసారి ప్రారంభమయ్యాయని హరీష్ రావు గుర్తు చేశారు. ఈ రెండింటిలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి సాగునీరు కూడా అందిస్తున్నామన్నారు. అయితే పోలవరం ప్రాజెక్టు మాత్రం ఇంకా పూర్తి కాలేదన్నారు. ఇంకో ఐదేళ్లు అయినా పోలవరం పూర్తి కాదని హాట్ కామెంట్స్ చేశారు.
హరీష్ రావు వ్యాఖ్యలపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు, కాళేశ్వరంకు నక్కకు, నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. కాళేశ్వరం బ్యారేజీ మాత్రమేనని, పోలవరం భారీ ప్రాజెక్ట్ అని అంబటి రాంబాబు గుర్తు చేశారు.
కాళేశ్వరం 2 టీఎంసీల సామర్థ్యం ఉన్న బ్యారేజీ మాత్రమేనని అంబటి తెలిపారు. అదే పోలవరంలో 196 టీఎంసీలు నిల్వ చేస్తామని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ పోలవరం అని ఉద్ఘాటించారు. కాబట్టి ఈ రెండింటినీ పోల్చడం సరికాదన్నారు. గొప్పలు చెప్పుకోవడానికే హరీష్ రావు ఇలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ను తక్కువ చేసే ఉద్దేశం ఏమీ తమకు లేదన్నారు.
గోదావరి వరద ప్రభావం ప్రస్తుతం పూర్తిస్థాయిలో తగ్గినట్లుగా భావిస్తున్నామని తెలిపారు. స్పిల్‌వే నుంచి 50 వేల క్యూసెక్కుల జలాలు దిగువకు విడుదల అవుతున్నాయని చెప్పారు. వరద ప్రభావం తగ్గడంతో పనులు పునఃప్రారంభిస్తున్నామని వెల్లడించారు. దిగువ కాఫర్ డ్యాం పనులు ఇప్పటికే ప్రారంభించామని అంబటి రాంబాబు గుర్తు చేశారు.
వరద జలాల నీటిమట్టం పూర్తిస్థాయిలో తగ్గిన తర్వాత ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల నడుమ ఉన్న డయాఫ్రంవాల్ చుట్టూ ఉన్న నీటిని తొలగిస్తామని చెప్పారు. అనంతరం నేషనల్ హైడ్రోపవర్ కార్పొరేషన్.. డయాఫ్రంవాల్ స్థితిగతులు పరిశీలిస్తుందన్నారు. వారి సూచనల మేరకు డయాఫ్రంవాల్ పునర్నిర్మాణం చేయాలా లేక పాత దానిమీదే ఎర్త్‌కం రాక్‌ఫిల్ డ్యాం నిర్మించాలా అనేది తేలుస్తామన్నారు.
కాఫర్ డ్యామ్‌ల నిర్మాణం పూర్తి కాకుండా డయాఫ్రంవాల్ నిర్మించడం చారిత్రాత్మక తప్పిదమని చెప్పారు. అందువల్ల ఉత్పన్నమైన సమస్యలను అధిగమించడానికి ఎక్కువ సమయం పట్టే పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. స్పిల్‌వే నిర్మాణం పూర్తయ్యిందని చెప్పారు. ఎర్త్‌కం రాక్‌ఫిల్ డ్యాం నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించి పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.