Begin typing your search above and press return to search.

మిత్రుడి మీద గ‌తాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు

By:  Tupaki Desk   |   15 Oct 2015 1:11 PM GMT
మిత్రుడి మీద గ‌తాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు
X
మిత్రుడంటే అలా ఉండాల‌న్న‌ట్లుగా ఒక‌ప్పుడు వ్య‌వ‌హ‌రించిన బీజేపీ.. శివ‌సేన‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం ముదురుతోంది. గ‌తంలో త‌మ‌లో ఎవ‌రి మీద ఈగ వాలినా త‌మ మీద‌నే వాలిన‌ట్లు ఫీల‌య్యే పార్టీలు ఇప్పుడు మాట‌ల తూటాలు విసురుకుంటున్నాయి. సుధీంద్ర కుల‌క‌ర్ణి పై ఇంకు దాడి వ్య‌వ‌హారాన్ని బీజేపీ ఖండించ‌టం.. శివ‌సేన‌కు మ‌రింత అగ్ర‌హం క‌లిగిస్తోంది. ఈ మ‌ధ్య కాలంలో ఈ రెండు పార్టీల మ‌ధ్య స‌ఖ్య‌త త‌గ్గిన సంగ‌తి తెలిసిందే.

త‌మ మీద విమ‌ర్శ‌లు చేస్తున్న శివ‌సేనకు క‌మ‌ల‌నాథులు గ‌తాన్ని త‌వ్వి తీసి దుమ్మెత్తిపోతారు. దేశ‌భ‌క్తి గురించి మాట్లాడుతున్న శివ‌సేన‌.. 1993లో ముంబ‌యి పేలుళ్ల సంద‌ర్భంగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న సంజ‌య్ ద‌త్ కు మ‌ద్ద‌తు ఎలా ఇచ్చింద‌ని ప్ర‌శ్నిస్తోంది. అంతేకాదు.. నాటి శివ‌సేన అధినేత బాల్ థాక్రే ఇంట్లో పాక్ క్రికెట‌ర్ మియాందాద్ కు అతిధ్యం ఎలా ఇచ్చార‌ని ప్ర‌శ్నించింది.

త‌మ‌పై విమ‌ర్శ‌ల్ని తిప్పి కొట్టే ప్ర‌య‌త్నంలో భాగంగా.. గ‌తాన్ని త‌వ్వి తీయ‌టంలో బీజేపీ విజ‌యం సాధించింద‌న్న మాట వినిపిస్తోంది. ఏ వాద‌న‌లైతే శివ‌సేనను ఇరుకున ప‌డేలా చేస్తాయో.. అవే అంశాల్ని ప్ర‌స్తావించ‌టం గ‌మ‌నార్హం. తాజా ఎపిసోడ్ తో రెండు పార్టీల మ‌ధ్య దూరం మ‌రింత పెర‌గ‌టం ఖాయంగా మారింది.

జాతీయ‌వాదం గురించి మాట్లాడే శివ‌సేన నేత‌లు 1993లో ముంబ‌యి పేలుళ్ల‌లో నిందితుడు సంజ‌య్ ద‌త్ కు మ‌ద్ద‌తు ఇవ్వ‌టం ఏ త‌ర‌హా జాతీయవాదం? అని ప్ర‌శ్నించిన బీజేపీ నేత‌లు.. దేశ‌భ‌క్తి పేరిట ఆందోళ‌న‌లు వ్య‌క్తం చేసేవారు దివంగ‌త బాల్ థాక్రే ఇంట (మాతృశ్రీ భ‌వ‌నం) పాక్ క్రికెట‌ర్ మియాందాదా అతిథ్యం పొందిన విష‌యాన్ని గుర్తు చేసుకోవాలంటూ ఏ మాట చెబితే త‌గులుతుందో అలాంటి మాట‌ల్నే అన‌టం గ‌మ‌నార్హం. చూస్తుంటే.. రానున్న రోజుల్లో ఒక‌నాటి మిత్రుల మ‌ధ్య మ‌రిన్ని మాట‌ల మంట‌లు త‌ప్ప‌వ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.