Begin typing your search above and press return to search.

మోడీ మీద యుద్ధం...కేసీయార్ కి మద్దతు ఎక్కడ ...?

By:  Tupaki Desk   |   24 Nov 2022 12:30 AM GMT
మోడీ మీద యుద్ధం...కేసీయార్ కి మద్దతు ఎక్కడ ...?
X
దేశంలో బలమైన నాయకుడిగా మోడీ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఏదో విధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఈ నేపధ్యంలో మోడీ మీద యుద్ధం అంటూ దేశంలో చాలా ప్రాంతీయ పార్టీలు సమరభేరీ మోగించినా ఏదో ఒక చోట ఆగిపోతూ వస్తున్నవే. ఆరు నెలల క్రితం వరకూ పశ్చిమ బెంగాల్ కాళిగా రచ్చ చేసిన మమతా బెనర్జీ ఇపుడు ఫుల్ సైలెంట్ అయ్యారు. ఆప్ ఇపుడు ఢిల్లీ పంజాబ్ లను గెలుచుకుని గుజరాత్ తో సై అంటోంది కానీ పూర్తి స్థాయి యుద్ధం అయితే ఇంకా మొదలెట్టలేదు, చేసే పరిస్థితి కూడా కనిపించడంలేదు.

దేశంలో మిగిలిన ప్రాంతీయ పార్టీలు కూడా ఎక్కడికక్కడ మోడీని విమర్శిస్తూ తమ రాజకీయ క్షేత్రాన్ని కాపాడుకోవాలని తపన పడుతున్నవే కానీ ఆ పరిధి దాటి బయటకు వచ్చిన దాఖలాలు లేవు. పైగా ఒక ప్రాంతీయ పార్టీ అంటే మరో ప్రాంతీయ పార్టీకి పొడ గిట్టని పరిస్థితి. ఈ అనైక్యతే మోడీ జోరు చేయడానికి కారణం అవుతోంది అన్న విశ్లేషణలు ఉన్నాయి.

ఇక ఇపుడు ఢిల్లీ కాక తెలంగాణాకు బాగా తగులుతోంది. మోడీకి సవాల్ చేసి కేసీయార్ తన దాకా కధను తెచ్చుకున్నారు అని అంటున్న వారూ ఉన్నారు. వరసబెట్టి మంత్రుల మీద ఐటీ ఈడీ దాడులు, అదే టైంలో టీయారెస్ సింపతీ కేటగిరీకి చెందిన వారి మీద రియల్ ఎస్టేట్ సంస్థల మీద ఈడీ, ఐటీ గురి పెట్టాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం తో కధ మొదలెట్టి చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారం పైన సీరియస్ లుక్కేశాయి.

ఇపుడు మరింతగా దూకుడు చేస్తూ ఐటీ ఈడీ దాడులు సాగిపోతున్నాయి. ఈ దూకుడుకు మంత్రులు లబలబలాడుతూంటే టీయారెస్ అగ్ర నేతలలో కూడా కలవరం రేగుతోంది. ఇదంతా కేంద్రం రాజకీయ కక్షతో తమ మీద చేయిస్తున్న దాడులు అంటూ మంత్రులు కీలక నేతలు తిప్పికొడుతున్నా ఎలా బయటకు రావడం దీని నుంచి అన్న బెంగ అయితే అందరికీ ఉంది. మరి ఇక దూకుడే చూసుకుందాం మీ పెతాపం మా పెతాపం అంటూ లంఘించిన కేసీయార్ ఈ దాడుల విషయంలో ఏం చేయబోతున్నారు అన్నదే చర్చగా ఉంది.

అయితే తనకు అందుబాటులో ఉన్న మంత్రులు కీలక నేతలతో నిర్వహించిన సమావేశంలో కేంద్ర వైఖరిని ఎండగట్టాలని తీర్మానించారుట. ప్రజా క్షేత్రంలో బీజేపీ రాజకీయ కక్షను వెలుగులోకి తెచ్చి జనం తీర్పు కోరాలని కేసీయార్ భావిస్తున్నారు అని అంటున్నారు. ఇతర రాష్ట్రాలు అంటే బీజేపీయేత రాష్ట్రాలలో ఇలాగే టార్గెట్ చేస్తూ వారిని బాధితులుగా మారుస్తున్నారని ఆ చిట్టా అంతా తీసి దాన్ని జనంలోనే తేల్చుకుని బీజేపీని అక్కడే బదనాం చేయాలని చూస్తున్నారుట. బీజేపీ బాధిలైన అందరి సహకారంతో జాతీయ స్థాయిలోనే చర్చకు పెట్టి ఢిల్లీ బీజేపీ బాసులతో అమీ తుమీకి సిద్ధపడాలని కూడా ఆలోచిస్తున్నారుట.

అయితే అదంత సులువు కాదేమో అన్న చర్చ ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఒక ప్రాంతీయ పార్టీని ఇబ్బంది పెట్టినపుడు మరో ప్రాంతీయ పార్టీ తమకేమి పట్టనట్లుగా గమ్మున ఊరుకుంది. అంతవరకూ ఎందుకు ఆరు నెలల క్రితం వరకూ మమతా బెనర్జీ కేంద్రం మీద పోరు కోసం అంతా కలసి రావాలని అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖలు ఎన్నో రాశారు.

తమిళనాడు తెలంగాణా సీఎంలకు కూడా లేఖలు అలా రాశారు. స్టాలిన్ రెస్పాండ్ అయినట్లుగా కూడా టీయారెస్ ఆనాడు అవలేదని గుర్తు చేస్తున్నారు. దాంతోనే ఆమె సైలెంట్ అయ్యారని అంటున్నారు. ఇపుడు కేసీయార్ వంతు వచ్చింది. ఆయన గులాబీ తోటలో అగ్గి రాజుకుంది. మరి ఆయన్ గగ్గోలు పెడితే ఇదే మమత కానీ స్టాలిన్ కానీ మరో నేత కానీ కలసి వస్తారా అన్నదే చర్చగా ఉంది.

ఒకవేళ వారు కలసిరాకపోతే కేసీయార్ పోరాటం పూర్తిగా తెలంగాణాకే పరిమితం అవుతుంది. కేంద్రం దాడులు అని చెప్పి సానిభూతి ఎంత పొందాలని చూసినా ఆ ఇంపాక్ట్ పెద్దగా రాదని అంటున్నారు. మొత్తానికి సవాల్ అంటూ సౌండ్ చేసినంత ఈజీ కాదు ఢిల్లీ పెద్దలతో పోరు చేయడం అని ఆలస్యంగా అయినా టీయారెస్ కి తెలిసివస్తోంది అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.