Begin typing your search above and press return to search.

60.. 68..71 శాతాలు పోలయ్యాయి

By:  Tupaki Desk   |   7 March 2016 4:33 AM GMT
60.. 68..71 శాతాలు పోలయ్యాయి
X
తెలంగాణ రాష్ట్రంలోని రెండు నగరపాలక సంస్థలకు.. నగర పంచాయితీకి జరిగిన ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ పూర్తి అయ్యింది. చెదురుమొదురు సంఘటలు మినహా.. ఎన్నికల ప్రక్రియ మొత్తంగా ప్రశాంతంగా ముగిసిందనే చెప్పాలి. వరంగల్.. ఖమ్మం జిల్లాల్లో చిన్న చిన్న సంఘటనలు టెన్షన్ క్రియేట్ చేసినప్పటికీ.. పోలీసుల రంగప్రవేశంతో అవి చల్లారాయి. ఇక.. పోలింగ్ చూస్తే.. తాజా స్థానిక ఎన్నికల్లో వరంగల్ మినహా.. మిగిలిన రెండు చోట్ల భారీగానే ఓట్లు నమోదైనట్లు చెప్పాలి.

వరంగల్ నగర పాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో 60.2శాతం ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మొత్తం 6.44లక్షల మంది ఓటర్లకు 3.87లక్షల మంది ఓట్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు. అదే సమయంలో ఖమ్మం నగరపాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో 67.6శాతం ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు. మొత్తం 2.65లక్షల ఓట్లకు 1.79లక్షల ఓట్లు పోలయ్యాయి.

ఇక.. మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట నగర పంచాయితీకి జరిగిన ఎన్నికల్లో భారీ పోలింగ్ నమోదైంది. మిగిలిన రెండు చోట్ల కంటే.. అచ్చంపేటలోనే అధిక ఓటింగ్ నమోదైంది. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. విపక్షాలన్నీ (టీడీపీ.. కాంగ్రెస్.. బీజేపీ తదితర పార్టీలు) మహాకూటమిగా ఏర్పడి తెలంగాణ అధికారపక్షాన్ని ఢీకొనటం గమనార్హం. ఈ కారణం చేతనే.. అచ్చంపేటలో మిగిలిన రెండు చోట్లతో పోలిస్తే.. భారీగా ఓట్లు నమోదయ్యాయి. వీటి ఫలితాలు బుధవారం (మార్చి 9) నాడు వెలువడనున్నాయి.