Begin typing your search above and press return to search.

వ‌రంగ‌ల్ ఎన్నిక వ‌చ్చే ఏడాదేనా?

By:  Tupaki Desk   |   9 Sep 2015 2:52 PM GMT
వ‌రంగ‌ల్ ఎన్నిక వ‌చ్చే ఏడాదేనా?
X
ఎంతో ఆశ‌గా ఎదురుచూసిన వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక ఇప్ప‌ట్లో జ‌రిగే సూచ‌న‌లు క‌నిపించ‌టం లేదు. బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల నోటిపికేష‌న్ విడుద‌ల చేసిన నేప‌థ్యంలో.. దేశ‌వ్యాప్తంగా పెండింగ్‌ లో ఉన్న ఉప ఎన్నిక‌ల్ని కూడా కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ ప్ర‌క‌టిస్తుంద‌ని భావించారు. అయితే.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్ని ప్రక‌టించిందే త‌ప్పించి.. వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక‌ల గురించి ఎలాంటి ప్ర‌స్తావ‌న తీసుకురాలేదు. దీంతో.. వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక ఇప్ప‌ట్లో నిర్వ‌హించే అవ‌కాశం లేన‌ట్లే.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వరంగ‌ల్ ఎంపీ స్థానం నుంచి క‌డియం శ్రీహ‌రి టీఆర్ ఎస్ త‌ర‌పున పోటీ చేసి గెలుపొందారు. అనంత‌రం ఆయ‌న్ను తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌విని ఇవ్వ‌టంతో ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. దాన్ని లోక్ స‌భ స్పీక‌ర్ జూలై 21న క‌డియం రాజీనామాను ఆమోదించారు.

నిబంధ‌న‌ల ప్ర‌కారం స్పీక‌ర్ రాజీనామా ఆమోదించిన రోజు నుంచి ఆరు నెల‌ల వ్య‌వ‌ధిలో ఉప ఎన్నిక‌ను నిర్వ‌హించాల్సి ఉంది. బీహార్ ఎన్నిక‌ల‌తో పాటు వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక‌కు షెడ్యూల్ ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని భావించారు. అలాంటిదేమీ లేక‌పోవ‌టంతో బీహార్ ఎన్నిక‌ల ప్ర‌క్రియ పూర్త‌య్యే వ‌ర‌కూ మ‌ళ్లీ నోటిషికేష‌న్ జారీ చేసే అవ‌కాశం ఉండ‌న‌ట్లే.

2016 జ‌న‌వ‌రి 20 లోపు ఉప ఎన్నిక ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల్సి ఉన్న నేప‌థ్యంలో బీహార్ ఎన్నిక‌ల ప్ర‌క్రియ పూర్తి అయిన త‌ర్వాత వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ జారీ చేసే అవ‌కాశం ఉందంటున్నారు. న‌వంబ‌రు 8న బీహార్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌తాయి. అంటే.. న‌వంబ‌రు 9 త‌ర్వాత ఎప్పుడైనా వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ వెలువ‌డే వీలుంది. ముంగిట్లోకి వ‌చ్చేశాయ‌ని భావించిన వరంగ‌ల్ ఉప ఎన్నిక‌కు మ‌రింత కాలం అవ‌కాశం చిక్క‌టంతో రాజ‌కీయ ప‌క్షాలు త‌మ వ్యూహాల‌కు మ‌రింత ప‌దును పెట్టే అవ‌కాశం ఉంది. మొత్తంగా వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక వ‌చ్చే ఏడాదే జ‌రిగే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.