Begin typing your search above and press return to search.

వరంగల్ ఉప ఎన్నిక పోలింగ్ : 15 లక్షల ఓట్లు

By:  Tupaki Desk   |   21 Nov 2015 3:50 AM GMT
వరంగల్ ఉప ఎన్నిక పోలింగ్ : 15 లక్షల ఓట్లు
X
తెలంగాణ అధికార.. విపక్షాలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ప్రచారం జరిపిన వరంగల్ ఉప ఎన్నిక పోలింగ్ షురూ అయ్యింది. కడియం శ్రీహరి తన ఎంపీ పదవికి రాజీనామా చేసి.. ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టటంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

ఈ ఉప ఎన్నికలో మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. మొత్తం 1778 పోలింగ్ కేంద్రాల్లో జరగనున్న పోలింగ్ కోసం మొత్తంగా 10 వేలమంది భద్రతా సిబ్బందిని వినియోగిస్తున్నారు.

అత్యంత సమస్యాత్మక.. సమస్యాత్మక ప్రాంతాల్లో మిలటరీ బలగాల్ని వినియోగిస్తున్నారు. ఈ ఉప ఎన్నిక కోసం 9428 మంది పోలింగ్ సిబ్బంది పాల్గొంటున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకూ సాగనుంది. ఈ ఎన్నికల్లో 15 లక్షల మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఒక విశేషం ఉంది. తొలిసారి ఈవీఎంలలో ఓట్లు వేసే ఓటర్లు.. తాము ఓటు వేసే అభ్యర్థికి సంబంధించిన ఫోటోను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఇలాంటి ఏర్పాటుతో పోలింగ్ నిర్వహించటం ఇదే తొలిసారి. ఈ ఉప ఎన్నిక ఫలితాలు ఈ నెల 24న (మంగళవారం) వెలువడనున్నాయి.