Begin typing your search above and press return to search.
ఈసారికి థ్యాంక్స్ గివింగ్ ఓటు కాంగ్రెస్ కు
By: Tupaki Desk | 18 Nov 2015 10:30 PM GMTవరంగల్ ఉప ఎన్నికకు సంబంధించి ఈసారి థ్యాంక్స్ గివింగ్ ఓటును కాంగ్రెస్ పార్టీకి వేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారా? తెలంగాణ తెచ్చినది తెలంగాణ రాష్ట్ర సమితి అయినా ఇచ్చినది మాత్రం కాంగ్రెస్సేనని ఓటర్లు భావిస్తున్నారా? అందుకే ఈసారికి అభ్యర్థి ఎవరైనా కాంగ్రెస్ ను ఆదరించాలని నిర్ణయించారా? ఈ ప్రశ్నలకు ఔను అనే అంటున్నాయి తాజా సర్వేలు.
అధికార తెలంగాణ రాష్ట్ర సమితితోపాటు వివిధ సర్వేలు ఇటీవలి కాలంలో వరంగల్ ఉప ఎన్నికల్లో సర్వేలు నిర్వహించాయి. ఈ సందర్భంగా ఈసారి ఎవరికి ఓటు వేస్తారనే ప్రశ్నను సంధించాయి. ఇందుకు అత్యధికులు కాంగ్రెస్ పేరు చెప్పినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తెలంగాణ తెచ్చింది టీఆర్ ఎస్ అయితే ఇచ్చింది కాంగ్రెస్సే. తెలంగాణ తెచ్చింది కనక గతంలో టీఆర్ ఎస్ ను గద్దెనెక్కించాం. ఏడాదిన్నర గడిచినా ఆ పార్టీ మా ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవడం లేదు. దానిని పక్కనపెట్టినా.. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే ఈసారికి థ్యాంక్స్ గివింగ్ ఓటును కాంగ్రెస్ కు వేయాలని భావిస్తున్నాం అని అత్యధికులు స్పష్టం చేశారు. సర్వే సత్యనారాయణ స్థానికుడు కాకపోయినా ఈసారి ఓటును మాత్రం కాంగ్రెస్ పార్టీని దృష్టిలో పెట్టుకునే వేయాలని కూడా భావిస్తున్నారు.