Begin typing your search above and press return to search.
అమెరికాలో తెలుగు స్టూడెంట్ హత్య
By: Tupaki Desk | 8 July 2018 4:40 AM GMTఅమెరికాలోని గన్ కల్చర్ కు తెలుగు విద్యార్థి ఒకరు బలయ్యారు. ఆర్నెల్ల క్రితం ఎంఎస్ చేసేందుకు అమెరికాకు వెళ్లిన తెలుగు విద్యార్థి ఒక హోటల్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. ఒక కస్టమర్ అడిగిన వస్తువును అందించి బిల్లు అడగటంతో.. ఆగ్రహంతో తుపాకీతో కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. ఈ ఉదంతంలో తీవ్ర గాయాలకు గురైన సదరు విద్యార్థి ఆసుపత్రిలో ప్రాణాలు విడిచిన వైనం షాకింగ్ గా మారింది.
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ కు చెందిన 26 ఏళ్ల కొప్పుల శరత్ ఆర్నెల్ల క్రితం అమెరికాకు మెళ్లారు. మిస్సోరి వర్సిటీలో ఎంఎస్ చేసేందుకు వెళ్లిన ఆయన.. స్థానికంగా ఒక హోటల్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి ఏడు గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఆహారం తీసుకున్నాడు. బిల్లు 30 డాలర్లు కాగా.. బిల్లు చెల్లించాలని కోరాడు. దీంతో.. తుపాకీ తీసి కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది.
శరత్ ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు వారి బంధువులు చెబుతున్నా.. అతను మరణించినట్లుగా తెలంగాణ పోలీసులు తమకు సమాచారం అందించినట్లు శరత్ బాబాయ్ ప్రసాద్ మీడియాకు వెల్లడించారు. హత్యకు గురైన శరత్ సొంతూరు వరంగల్ లోని కరీమాబాద్. అతడి తండ్రి రామ్మోహన్ హైదరాబాద్ లోని బీఎస్ ఎన్ ఎల్ లో ఉద్యోగం చేస్తుంటారు. తల్లి మాలతి వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి పంచాయితీ రాజ్ శాఖలో ఈవోఆర్డీగా పని చేస్తున్నారు. వీరికి ఒక కుమారుడు.. కుమార్తె ఉన్నారు. ఇటీవల ఇంజనీరింగ్ పూర్తి చేసిన శరత్ హైదరాబాద్‌లో మూడేళ్లు ఉద్యోగం చేశారు.
తాజాగా ఎంఎస్ చేసేందుకు అమెరికాకు వెళ్లారు. అమెరికాలోని మిస్సోరి వర్సిటీలో చదువుకుంటూ కన్సాస్ నగరంలోని ప్రాస్పెక్ట్ అవెన్యూలోని జేఎస్ ఫిష్ అండ్ చికెన్ మార్కెట్ అనే హోటల్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. చేతికి అంది వచ్చిన కుమారుడు దారుణ హత్యకు గురైన వైనం తెలియటంతో శరత్ కుటుంబ సభ్యులు.. బంధువులు షాక్ కు గురయ్యారు. శోకసంద్రంలో మునిగిపోయారు.