Begin typing your search above and press return to search.
శరత్ ప్రాణాలు పోవటానికి కారణం అదేనా?
By: Tupaki Desk | 8 July 2018 9:51 AM GMTఉన్నత చదువులు చదువుకోవటానికి అమెరికాకు వెళ్లిన కొప్పు శరత్ తాజాగా హత్యకు గురి కావటమ తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. అమెరికాలోని తెలుగు వారికి తాజా ఉదంతం షాకింగ్ గా మారింది. ఇదిలా ఉండగా శరత్ హత్యపై మరింత స్పష్టత ఇచ్చేలా స్థానిక మీడియా సంస్థలు శరత్ హత్యకు సంబంధించిన సీసీ కెమేరా ఫుటేజ్ ను ప్రసారం చేశాయి.
లోకల్ ఛానల్స్ కథనం ప్రకారం మిస్సోరిలోని కాన్సస్ సిటీలోని రెస్టారెంట్ లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు శరత్. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం అతడు డ్యూటీలో ఉన్న వేళ.. ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి గన్ తో బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో.. భయానికి గురైన అక్కడి వారు టేబుల్ కిందకు నక్కారు.
అయితే.. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయకూడదో శరత్ అదే పని చేశాడు. బెదిరింపుల సమయంలో వెంటనే చేతులు ఎత్తేయటం.. కిందకు పడుకోవటం లాంటివి చేయాలి. అందుకు భిన్నంగా శరత్ మాత్రం భయంతో పరుగులు తీశాడు. దీంతో.. ఆగంతకుడు కాల్పులు జరిపాడు. నాలుగు రౌండ్లు కాల్చటంతో శరత్ కుప్పకూలిపోయారు. తీవ్ర గాయాలపాలైన శరత్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.అయితే.. శరత్ మాత్రం ప్రాణాల్ని కాపాడలేకపోయారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. నిందితుడి వివరాలు పెట్టిన వారికి అధికారులు ప్రకటించారు. శరత్ నుకాల్చి చంపిన దుండగుడి ఆచూకీకి సంబంధించిన ఆధారాలు లభిస్తే 911 కాల్ చేసి సమాచారం అందించాలని కోరుతున్నారు. శరత్ ను పొట్టకున్న వారిని వదిలేది లేదని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే అమర్ పేటలోని శరత్ తల్లిదండ్రుల్ని మంత్రులు కేటీఆర్.. కడియంతో సహా పలువురు పరామర్శించారు. వాస్తవానికి శరత్ సోదరి పెళ్లి మరికొద్ది రోజుల్లో జరగనుంది. దీనికి హాజరయ్యేందుకు శరత్ నగరానికిరావాల్సి ఉంది. అంతలోనే ఈ దారుణం చోటు చేసుకుంది.
వీడియో కోసం క్లిక్ చేయండి