Begin typing your search above and press return to search.
వార్న్ పోస్టుమార్టం రిపోర్ట్..ఆ కారణంతోనే మృతి
By: Tupaki Desk | 7 March 2022 10:42 AM GMTఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ హఠాత్తుగా గుండెపోటుతో మరణించినట్లు ప్రాథమికంగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. థాయ్ ల్యాండ్ లోని తన విల్లాలో వార్న్ కు గుండెపోటు వచ్చిందని, కాపాడేందుకు ప్రయత్నించేలోపే మృతి చెందాడని ఆయన స్నేహితులు, మేనేజర్లు వెల్లడించారు.
అయితే, వార్న్ మృతిపై కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. వార్న్ హార్ట్ ఎటాక్ తోనే మరణించారా లేదా అన్న సందేహాలు వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే తాజాగా వార్న్ మృతి మిస్టరీ వీడేలా థాయిలాండ్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. సహజ కారణాలతోనే వార్న్ మరణించాడని వారు నిర్ధారించారు. వార్న్ భౌతిక కాయానికి పోస్ట్ మార్టమ్ పూర్తయిన తర్వాత పోలీసులు ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు.
వార్న్ పోప్ట్ మార్టమ్ నివేదికన ఆయన కుటుంబానికి అందజేసి వారి ఆమోదాన్ని తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. వార్న్ భౌతికకాయాన్ని ఆయన కుటుంబానికి అప్పగించేందుకు వీలుగా బ్యాంకాక్ లోని ఆస్ట్రేలియా కాన్సులేట్ కు తరలించనున్నట్టు తెలిపారు.
దర్యాప్తు అధికారులకు డాక్టర్లు ఇచ్చిన పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ అందిందని, వార్న్ ది సహజ మరణమేనని రిపోర్ట్ లో వైద్యులు పేర్కొన్నారని పోలీసులు వెల్లడించారు. చట్టం అనుమతించిన కాల వ్యవధిలోపు ప్రాసిక్యూటర్లకు పోస్టు మార్టం వివరాలను అందజేస్తామని ప్రకటించారు. కాగా, గత శుక్రవారం వార్న్ థాయ్ లాండ్ లోని సముజనా విల్లాస్ రిసార్ట్ లో మరణించడం, ఆ గదిలో రక్తపు మరకలు ఉన్నట్టు ప్రచారం జరగడంతో ఈ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.
అయితే, శుక్రవారం నాడు తన విల్లాలో వార్న్ విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించిన స్నేహితులు..ఆయనకు సీపీఆర్ చేశారని, గుండెపై ఒత్తిడి తెచ్చే క్రమంలో వార్న్ రక్తపు వాంతులు చేసుకున్నాడని ప్రాధమిక విచారణలో వెల్లడైంది. పోస్టు మార్టం రిపోర్టులో కూడా సహజ మరణమని తేలింది. మరి, తాజా పోస్టు మార్టం నివేదికతోనైనా ఆ అనుమానాలకు పుల్ స్టాప్ పడుతుందేమో వేచి చూడాలి.