Begin typing your search above and press return to search.

ర‌న్ తీయ‌టం ఆపి.. బౌల‌ర్ కు షూ ఇచ్చాడు

By:  Tupaki Desk   |   10 April 2017 4:06 PM GMT
ర‌న్ తీయ‌టం ఆపి.. బౌల‌ర్ కు షూ ఇచ్చాడు
X
పోటీ పెరిగిన‌ప్పుడు క్రీడా స్ఫూర్తిని ప‌క్క‌న ప‌డేసి.. గెలుపే ధ్యేయంగా మారిన వైనం ఈ మ‌ధ్య‌న త‌ర‌చూ చేస్తున్నాం. ఇందులో భాగంగా న్యాయాన్యాయాల్ని మ‌ర‌చి.. క్రీడాస్ఫూర్తిని ప‌క్క‌న పెట్టేసి మ‌రీ.. ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించే తీరు చాలామంది క్రికెట‌ర్ల‌లో క‌నిపిస్తోంది. క్రికెట్ ను జెట్మింల్ మెన్ గేమ్ అంటూ ఒక‌ప్పుడు పిలిచే దాని స్థానే.. తిట్లు.. ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా ప్ర‌వ‌ర్తించే ధోర‌ణి అంత‌కంత‌కూ పెరుగుతోంది.

మైదానంలో ఎంత దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తే.. అంత హీరోగా భావించే తీరు ఈ మ‌ధ్య‌న ఎక్కువైంది. ఇలాంటి వేళ‌.. తాజా ఐపీఎల్ సీజన్‌ లోచోటు చేసుకున్న ఒక సీన్‌.. ప్రేక్ష‌కుల్ని.. ఆట‌గాళ్ల‌ను విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది.

ఐపీఎల్ 10వ సీజ‌న్లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ గా బ‌రిలోకి దిగిన హైద‌రాబాద్ స‌న్ రైజ‌ర్స్ దూసుకెళుతున్న తీరు తెలిసిందే. రెండు విజ‌యాల‌తో దూసుకెళుతున్న ఈ జ‌ట్టు.. తాజాగా గుజ‌రాత్ ల‌య‌న్స్ పై తొమ్మిది వికెట్ల తేడాతో విజ‌యాన్ని సాధించింది. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుకు ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌కుండా ఆడేసిన హైద‌రాబాద్ జ‌ట్టు ఆట‌గాళ్లు.. ఆట‌తో మెరుపులు మెరిపించ‌ట‌మే కాదు.. క్రీడా స్ఫూర్తిగా అద‌ర‌గొట్టేసి.. ప్ర‌త్య‌ర్థి ఆట‌గాళ్ల మ‌న‌సుల్ని దోచుకోవ‌టం విశేషం. ఇంత‌కూ జ‌రిగిందేమంటే..

గుజ‌రాత్ ల‌య‌న్స్ బౌల‌ర్ బ‌సిల్ థంపి ప‌దో ఓవ‌ర్లో హెన్రిక్యూస్ కు వేశాడు. దాన్ని అత‌డు లాంగాన్ మీదుగా ఆడాడు. ఈ క్ర‌మంలో బంతిని ఆపే క్ర‌మంలో తంపి షూ ఊడి.. దూరంగా ప‌డిపోయింది. అత‌డూ కింద‌కు ప‌డిపోయాడు. ఇలాంట‌ప్పుడు నాన్ స్ట్రైక‌ర్ ఎండ్ నుంచి ప‌రుగు కోసం ప‌రిగెడుతున్న వార్న‌ర్ గొప్ప క్రీడాస్ఫూర్తిని ప్ర‌ద‌ర్శించారు. త‌న ప‌రుగు తాను తీసేయ‌కుండా.. ర‌న్ మ‌ధ్య‌లో ఆపి.. షూను తంపి చేతిలో పెట్టి ప‌రుగులు తీసి.. త‌న క‌ర్త‌వ్యాన్ని.. క్రీడాస్ఫూర్తిని ప్ర‌ద‌ర్శించారు. దీంతో.. అత‌డి తీరును కామెంటేట‌ర్లు మొద‌లు.. మైదానంలోకూర్చున్న ప్రేక్ష‌కులు.. టీవీల్లో మ్యాచ్ చూస్తున్న వారే కాదు.. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు ఆట‌గాళ్లు మెచ్చుకోకుండా ఉండ‌లేక‌పోయారు. దూకుడుత‌నంతో ఇష్టారాజ్యంగా ఆట‌గాళ్లు వ్య‌వ‌హ‌రిస్తున్న వేళ‌.. వార్న‌ర్ వ్య‌వ‌హ‌రించిన తీరును క‌చ్ఛితంగా అభినందించాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/