Begin typing your search above and press return to search.
విమర్శకులపై సెటైర్ల తో రెచ్చిపోయిన వార్నర్ సతీమణి !
By: Tupaki Desk | 15 Nov 2021 8:31 AM GMTటీ20 వరల్డ్ కప్ లో కొత్త విజేతగా ఆస్ట్రేలియా అవతరించింది. న్యూజిలాండ్‌తో దుబాయ్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో గెలిచి, తొలిసారి టీ20 వరల్డ్ కప్ ని ముద్దాడింది. క్రికెట్ చరిత్రలో ఇది ఏడో టీ20 వరల్డ్ కప్ కాగా.. ఇప్పటి వరకూ వెస్టిండీస్ మినహా ఏ జట్టు కూడా రెండు సార్లు ఈ కప్ ని గెలవలేదు. ఇక ఇదిలా ఉంటే .. ఐపీఎల్ 2021 సీజన్ సందర్భంగా నిలకడలేమి ఫామ్‌తో సతమతమైన ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ కెరీర్ ముగిసినట్లేనని క్రికెట్ విశ్లేషకులు విమర్శలు గుప్పించారు. ప్రతీ సీజన్‌లో 500 ప్లస్ రన్స్ చేసిన వార్నర్. ఈ సీజన్ లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు.
ఐపీఎల్ రెండు దశల్లోనూ ఆకట్టుకోలేకపోయాడు. 8 మ్యాచ్ ల్లో కేవలం 195 రన్స్ మాత్రమే చేశాడు. టీ20 ప్రపంచ కప్ ప్రాక్టీస్ మ్యాచ్ లతో పాటు ఆరంభం మ్యాచ్ ల్లోను వార్నర్ దారుణంగా విఫలమయ్యాడు. దాంతో వార్నర్ కెరీర్ ముగిసినట్లేనని, ఫామ్ కోల్పోయిన అతను మరీ నెమ్మదిగా ఆడుతున్నాడని, అతని బ్యాటింగ్ పాత తరంలా ఉందని విమర్శలు గుప్పించారు. అయితే శ్రీలంక తో మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో టచ్ లోకి వచ్చిన వార్నర్ తన ఫామ్ ను ఫైనల్ వరకు కొనసాగించాడు. అద్వితీయమైన బ్యాటింగ్ తో ఆసీస్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 7 మ్యాచ్ ల్లో మూడు హాఫ్ సెంచరీలతో 284 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచి విమర్శకులు ముక్కున వేలు వేసుకునేలా చేశాడు.
ఇందులో నాలుగు విన్నింగ్ నాక్స్ ఉన్నాయి. ముఖ్యంగా వెస్టిండీస్‌తో చివరి లీగ్ మ్యాచ్ లో వార్నర్ ఆడిన తీరు.. సెమీస్‌లో ఆరంభంలోనే వికెట్లు కోల్పయినా తీవ్ర ఒత్తిడిలో స్వేచ్చగా ఆడిన విధానం అతని కెరీర్ లోనే హైలైట్. ఇక వార్నర్ ఫామ్ లోకి రావడంతో అతని సతీమణి క్యాండిస్ వార్నర్ సంతోషానికి హద్దే లేకుండా పోయింది. విమర్శకుల ప్రతీ మాటను గుర్తు పెట్టుకున్నా ఆమె వారికి తనదైన శైలిలో బదులిచ్చింది. వార్నర్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఫొటోను షేర్ చేస్తూ మా ఆయన ఫామ్ లో లేరా అండి అని ప్రశ్నిస్తూ విమర్శకులపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఫామ్ కోల్పోయి, పాత తరం ఆట ఆడుతున్న డేవిడ్ వార్నర్ కు అభినందనలు అంటూ.. నవ్వుకునే ఏమోజీలతో సెటైర్లు వేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారాయి.