Begin typing your search above and press return to search.
ప్రమాదంలో..భారత ఆర్థిక వ్యవస్థ..పుంజుకునేదెలా...?
By: Tupaki Desk | 16 Oct 2019 5:30 PM GMTప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం - జనాభా విషయంలో రెండో అతిపెద్ద దేశం. వనరులు పుష్కలం గా ఉన్న దేశం. ఇతర దేశాలతో పోల్చుకుంటే.. యువతీయువకుల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశం భారత్. అలాంటి దేశం అభివృద్దిలో ఎలా దూసుకుపోవాలి? ఎలాంటి దూకుడు ప్రదర్శించాలి? కానీ, ఇప్పుడు ఎలా ఉంది? ఏ పరిస్థితిని ఎదుర్కొంటోంది? ఆర్థికంగా మాంద్యం ముట్టడించి దేశాన్ని అతలాకుతలం చేసేందు కు కోరలు చాచి రయ్యన ఎగిరేందుకు సిద్ధంగా ఉంది. ఇది ముమ్మాటికీ నిజం. దేశంలో ఆర్థిక వ్యవస్థ తలకిందులై.. ప్రభుత్వాలు ప్రజలకు సేవలు చేసేందుకు ముందుకురాలేని పరిస్థితి మరికొద్ది రోజులలోనే ఏర్పడనుంది.
ఇది ఎవరో చిన్నా చితకా విశ్లేషకులు చెబుతున్న మాటలైతే.. రాజకీయ నాయకులైతే.. ఏదో పబ్బం గడుపు కొనేందుకు చెబుతున్నారులే అని సరిపుచ్చుకునేవారం. కానీ, తలలు పండిన ఆర్థిక నిపుణులు - రాజకీయ గాలి సోకని ఆర్థిక వేత్తలు చెబుతున్న అక్షర సత్యం. యూపీఏ హయాలో 5-6 మధ్య కొట్టుకు లాడిన జీడీపీ (గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్-తలసరి వృద్ది)ని మేం 8-10మధ్యకు తీసుకు వచ్చాం. ఇంతకన్నా ఏంచేయాల ని గత ఐదేళ్ల కాలంలో బీజేపీ ప్రకటించింది. అయితే, ఈ దూకుడుతోనే తీసుకున్న రెండు కీలక నిర్ణయాల పర్యవ సానంగా ఇప్పుడు దేశం మాంద్యం కోరల్లో చిక్కుకుంది.
అత్యధిక బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న ప్రధాని మోడీ.. తనకు తిరుగేలేదన్న విధంగా రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాత్రికి రాత్రే పెద్ద నోట్లను రద్దు చేశారు. అదేసమయంలో ప్రభుత్వాలు వద్దన్నా.. రాష్ట్రాలపైకి జీఎస్టీని రుద్ది వదిలి పెట్టారు. ఫలితంగా చిన్నా చితకాపరిశ్రమలు.. మూత బడ్డాయి. పనులు లేకుండా పోయాయి. భారీ సంఖ్యలో ఉద్యోగులు నిరుద్యోగులయ్యారు. పెట్టుబడులు లేక వ్యవసాయం వృద్ధిని కోల్పోయింది. అదే సమయంలో కోట్ల రూపాయల్లో అప్పులు ఎగ్గొట్టారనే మిషతో బ్యాంకులకులక్షల కోట్ల రూపాయలు అందించారు. ఫలితంగా ఆర్థికంతలకిందులైంది.
ఇటువంటి పరిస్థితుల్లో వినియోగదారులు ఒక భీతావహ మనస్థితిలో చిక్కుకుంటారని, తమ అవసరాలపై మరింతగా ఖర్చుచేయడానికి విముఖత చూపుతారని ఆర్థిక వేత్త జాన్ మేనార్డ్ కీన్స్ ( 1883-–1946) అంటారు. సాధారణ పరిస్థితుల్లో ఒక వ్యక్తి చేసే ఖర్చులు మరో వ్యక్తికి ఆదాయ మవుతాయి. కూరగాయల కొనుగోలుకు చేసే వ్యయం వాటిని పండించిన రైతుకు ఆదాయమవుతుంది. పుస్తకాలు కొనుగోలుకు ఒక విద్యార్థి వెచ్చించే మొత్తం ప్రచురణకర్తకు ఆదాయమవుతుంది. ఈ వ్యయాలు, ఆదాయాలు సహజమైనవి. అనివార్యమైనవి. అవి, ఒక వ్యాపార వలయంలో భాగం.
అయితే ఆదాయాన్ని పొందే వ్యక్తి మరింత ఎక్కువగా ఖర్చు పెట్టడానికి వెనుకాడితే ఆ వ్యాపార వలయం విచ్ఛిన్నమవుతుంది. ఈ పరిస్థితిని ఏమాత్రం గమనించకుండానే ప్రభుత్వం తీసుకున్న దుందుకుచర్యల ఫలితంగా నేడు దేశం ఆర్థిక గమనంలో తప్పటడుగులు వేస్తూ.. మాంద్యంలో చిక్కుకుపోతోంది. దీని నుంచి దేశాన్ని కాపాడే నాథుడు ఎవరనే ప్రశ్నకు సమాధానం కూడా లభించని పరిస్థితి నెలకొంది.