Begin typing your search above and press return to search.

ల‌వ్ చేస్తున్న‌ట్టు అమ్మాయికే చెప్ప‌లేదు..చంపేస్తాన‌ని పెళ్లికొడుక్కి వార్నింగ్‌!

By:  Tupaki Desk   |   18 March 2021 11:30 PM GMT
ల‌వ్ చేస్తున్న‌ట్టు అమ్మాయికే చెప్ప‌లేదు..చంపేస్తాన‌ని పెళ్లికొడుక్కి వార్నింగ్‌!
X
హైద‌రాబాద్ లో ఉండే ఓ సెన్స్ లేని ప్రేమికుడి క‌థ ఇది! ఇత‌గాడు ఓ అమ్మాయిని ప్రేమించాడు. కాలేజీకి వెళ్తున్న‌ప్పుడు.. మార్కెట్ కు వెళ్తున్న‌ప్పుడు చూసి ఫాలో అయ్యేవాడు. ఆమెనే జీవిత భాగ‌స్వామిని చేసుకోవాల‌ని ఫిక్స్ అయ్యాడు. ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది. కానీ.. ఓ రోజు జీర్ణించుకోలేని వార్త అత‌ని చెవిన ప‌డింది. తాను ప్రేమించిన అమ్మాయికి పెళ్లి కుదిరింద‌న్న‌ది ఆ వార్త సారంశం. దీంతో తీవ్ర నిరాశ‌లో కూరుకుపోయాడు. ఏం చేయాలా? అని బాగా ఆలోచించాడు. చివ‌ర‌కు ఏం చేయాలో నిర్ణ‌యించుకున్నాడు.

దోస్తులు ఎవ‌రైనా చెప్పారో.. లేక‌, సొంత నిర్ణ‌య‌మో తెలియ‌దుగానీ.. అమ్మాయిని పెళ్లి చేసుకోబోయే యువ‌కుడి ఫోన్ నెంబ‌ర్ తెలుసుకున్నాడు. ఓ మెసేజ్ సెండ్ చేశాడు. అందులో ఏముందంటే.. ''నువ్వు పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి నాది. ఆమెను గాఢంగా ప్రేమించాను. ఆమెనే పెళ్లి చేసుకోవాల‌ని చూస్తున్నా. ఇప్పుడు నువ్వొచ్చావు. న‌న్ను కాద‌ని పెళ్లి చేసుకుంటే నిన్ను చంపేస్తా. ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకో'' అని ఉంది.

వీడెవ‌డో టుంబ్రీ అయిఉంటాడ‌ని స‌ద‌రు యువ‌కుడు లైట్ తీసుకుని, త‌న పెళ్లి ప‌నుల్లో బిజీగా ఉన్నాడు. పెళ్లికి ముహూర్తం ఊడా నిర్ణ‌యించుకున్నారు. బంధువుల హ‌డావిడి కొనసాగుతూనే ఉంది. కానీ.. ఇలాంటి మెస్సేజ్ మ‌ళ్లీ వ‌చ్చింది. మ‌రోసారి వ‌చ్చింది. దీంతో.. పెళ్లికొడుక్కి డౌట్ వ‌చ్చింది. వెంట‌నే ఈ విష‌యం త‌ల్లిదండ్రుల‌కు చెప్పాడు. ఇదెక్క య‌వ్వారం అని బాధ‌ప‌డిపోయి.. విష‌యాన్ని అమ్మాయి త‌ల్లిదండ్రుల‌కు చెప్పారు. వాళ్ల గుండెలు ప‌గిలినంత ప‌నైంది.

ఏంటిది? ఎవ‌డు వాడు? అంటూ ఆరాతీశారు కుటుంబ స‌భ్యులు. ఇదేమీ తెలియ‌ని అమాయ‌కురాలు తీవ్ర‌ భ‌యాందోళ‌న‌కు గురైంది. నాకే పాపం తెలియ‌దంటూ క‌న్నీళ్లు పెట్టుకుంది. ఆ మెసేజ్ ఎవ‌రు పంపార‌ని చూసి, ఆ నెంబ‌ర్ ట్రేస్ చేస్తే తెలిసింది ఏమంటే.. అత‌డు మరెవ‌రో కాదు.. వీళ్ల ద‌గ్గ‌రి బంధువుల అబ్బాయే! మ‌రింత షాక్ కుగురైన వీళ్లంతా ఎందుకిలా చేశావ‌ని ప్ర‌శ్నిస్తే.. తాను అమ్మాయిని ప్రేమిస్తున్నాన‌ని చెప్పుకొచ్చాడు. మ‌రి, ఈ విష‌యం అమ్మాయికి తెలుసా..? అంటే.. తెలియ‌ద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం! త‌న‌ది వ‌న్ సైడ్ ల‌వ్ అని ప్ర‌క‌టించాడు.

ఇది విన్న వాళ్ల‌కు ఎక్క‌డ లేని కోపం త‌న్నుకొచ్చింది. క‌నీసం ప్రేమ గురించి అమ్మాయికి కూడా చెప్ప‌లేదు. ఆ అమ్మాయికి ఇత‌డంటే ఇష్టం ఉందో లేదో కూడా తెలియ‌దు. ఆమెకు పెళ్లి కుదిరిన త‌ర్వాత కూడా విష‌యం బ‌య‌ట పెట్ట‌లేదు. కానీ.. పెళ్లి కుదిరింద‌ని అమ్మాయి, అబ్బాయి త‌ర‌పువాళ్లు బంధువులంద‌రికీ చెప్పుకుని పెళ్లికి సిద్ధ‌మైన త‌ర్వాత వ‌రుడికి బెదిరింపులు మెసేజ్ చేశాడు ఈ పొల్ల‌గాడు. పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తే.. చీటింగ్ కేసు పెట్టారు. ఇలాంటి వాణ్ని ఏమ‌నాలి?