Begin typing your search above and press return to search.
ఉద్యోగులకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన బఫెట్
By: Tupaki Desk | 2 March 2017 1:05 PM GMTప‌్రపంచ కుబేరుల్లో ఒకరైన వారెన్ బఫెట్.. తన బెర్క్‌షైర్ హాథవే కంపెనీ ఉద్యోగులకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. తాను చెప్పిన పని సరిగ్గా చేయగలిగితే.. ఏడాదికి మిలియన్ డాలర్ల చొప్పున జీవితాంతం ఇస్తానని స్పష్టంచేశారు. అయితే ఆయన చెప్పిన పని వారి ఉద్యోగానికి సంబంధించి కాదు. నేషనల్ కాలేజియేట్ అథ్లెటిక్ అసోసియేషన్ నిర్వహించే బాస్కెట్ బాల్ చాంపియన్ షిప్ లో స్వీట్ 16 రౌండ్ కు ఏ టీమ్స్ చేరతాయో కచ్చితంగా అంచనా వేయగలిగిన వారికి ఈ బంపర్ ప్రైజ్ మనీ దక్కనుంది. గత నెల 27న సీఎన్ బీసీ ఇంటర్వ్యూలో భాగంగా వారెన్ బఫెట్ ఈ ఆఫర్ ప్రకటించారు. అప్పటి నుంచి ఆయన పేరు ఫేస్ బుక్ లో ట్రెండింగ్ అవుతోంది.
పోటీలో విజేతలను కచ్చితంగా అంచనా వేయలేకపోయినా.. చివరి వరకు వచ్చినవారికి కూడా లక్ష డాలర్లు తాము ఇస్తున్నామని బఫెట్ వెల్లడించారు. గతేడాది ఇద్దరు చివరిదాకా వచ్చారు. అందులో ఒకరికి బాస్కెట్ బాల్ గురించి అన్నీ తెలుసు. మరొకరికి అసలు ఏమీ తెలియదు. దీంతో ఇద్దరికీ ప్రైజ్ మనీని సమంగా పంచామని బఫెట్ చెప్పారు. 2014 నుంచి బఫెట్ తమ సంస్థలో ఈ కాంటెస్ట్ నిర్వహిస్తున్నారు. గతేడాది దీని కోసం 85 వేల ఎంట్రీస్ రాగా.. ఈసారి ఇంకా ఎక్కువే వస్తాయని ఆయన అంచనా వేస్తున్నారు. దేశం నలుమూలల నుంచి 68 టీమ్స్ ప్రస్తుతం ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. అందులో నుంచి స్వీట్ 16కు ఎవరు వస్తారన్నది కచ్చితంగా అంచనా వేయడం చాలా కష్టమని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బౌల్డర్ ప్రొఫెసర్ మార్క్ అబ్లోవిజ్ అన్నారు. ఈ టోర్నీ ఈసారి మార్చి 14 నుంచి ప్రారంభం కాబోతుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/