Begin typing your search above and press return to search.
ట్రంప్ ను ఓడిస్తానంటున్న అమెరికా కుబేరుడు
By: Tupaki Desk | 2 Aug 2016 6:29 AM GMTతన నోటి మాటలతో కొద్దిపాటి అభిమానులను సంపాదించుకున్నా.. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని అనుమానాలను రేకెత్తించారు డొనాల్డ్ ట్రంప్. ఆయన వస్తే అమెరికా సమస్యలతోపాటు - ప్రపంచ సమస్యలు కూడా క్లియర్ అయిపోతాయని కొందరు వ్యాఖ్యానిస్తుంటే.. డొనాల్డ్ ట్రంప్ గెలవడం అమెరికాకే కాదు, ప్రపంచ దేశాలకు సైతం ప్రమాధమని వ్యాఖ్యానించేవారు మరికొందరు. ఈ విషయంలో డొనాల్డ్ ట్రంప్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు అమెరికా కుబేరుడు వారెన్ బఫెట్.
నెబ్రాస్కాలో హిల్లరీ క్లింటన్ తో కలిసి ప్రచారంలో పాల్గొన్న వారెన్ బఫెట్.. ట్రంప్ వ్యాపార రికార్డును - దివాలా చరిత్రను ప్రశ్నించారు. అసలు ట్రంప్ తన ఆదాయపన్ను రిటర్నులను ఎందుకు బహిర్గతం చేయడంలేదో చెప్పాలని ప్రశ్నించిన బఫెట్.. ట్రంప్ కు వ్యతిరేకంగా ఓటేసేవారు పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేనిపక్షంలో తాను దగ్గరుండి తీసుకెళ్తానని తెలిపారు. డోనాల్డ్ ట్రంప్ ను ఓడించేందుకు తాను శాయశక్తులా ప్రయత్నిస్తానని, దగ్గరుండి అతడిని ఓడిస్తానని చెబుతున్నారు.
ఖిజర్ - ఘజేలా ఖాన్ అనే ముస్లిం - అమెరికన్ దంపతుల కుమారుడు అమెరికా సైన్యంలో పనిచేస్తూ 2004లో ఇరాక్‌లో మరణిస్తే.. ఈ కుటుంబ త్యాగాన్ని ట్రంప్ తక్కువ చేసి మాట్లాడారని బఫెట్ మండిపడ్డారు. మదుపుదారులు తమ పెట్టుబడులు నష్టపోవడానికి 1995లో ట్రంప్ తన కేసినో - హోటల్ కంపెనీలను లిఫ్ట్ చేయడమే కారణమని బఫెట్ తెలిపారు. నెబ్రాస్కా రాష్ట్రం రిపబ్లికన్ల ఆధీనంలోనే ఉన్నా కూడా 2008 ఎన్నికల్లో బరాక్ ఒబామాకు ఇక్కడ ఆధిక్యం లభించింది. అక్కడ ఒమాహా సహా మిగిలిన శివారు ప్రాంతాల్లో హిల్లరీ క్లింటన్ ఇప్పటికే ప్రచారం చేశారు. కాగా... తటస్థంగా ఉన్న, స్వతంత్రంగా వ్యవహరించే ఓటర్లను ప్రభావితం చేసేందుకు వారెన్ బఫెట్ సహా మరికొందరు వ్యాపారవేత్తలు సంవత్సరం క్రితమే క్లింటన్ కు మద్దతు పలికారు.