Begin typing your search above and press return to search.
అతడితో లంచ్ కోసం 31 కోట్లు ఖర్చు చేస్తున్నాడు!
By: Tupaki Desk | 3 Jun 2019 4:38 AM GMTభోజనం కోసం ఎంత ఖర్చు చేయొచ్చు? ఈ ప్రశ్నకు ఎవరి సమాధానం వారు చెప్పేస్తారు. కానీ.. ఒక వ్యక్తి పెట్టేస్తున్న ఖర్చును మాత్రం కలలో ఊహించరు. ఒక లంచ్ కోసం ఇంత భారీగా ఎవరు ఖర్చు చేయరేమో? ఆ మాటకు వస్తే.. ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన లంచ్ ఇదే అవుతుందేమో?
అమెరికా ఇన్వెస్ట్ మెంట్ గురు.. అపర కుబేరుడు వారెన్ బఫెట్ తో లంచ్ చేయటం కోసం ప్రతి ఏటా మాదిరే ఈసారి బిడ్ నిర్వహించారు. ఇందులో ఒక వ్యక్తి (పేరు వెల్లడించలేదు) బఫెట్ తో లంచ్ కోసం ఏకంగా రూ.31 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యాడు. దీంతో.. ఆయనతో కలిసి బఫెట్ లంచ్ చేయనున్నారు.
గడిచిన 20 ఏళ్లుగా బఫెట్ ఏడాదికి ఒకసారి తనతో లంచ్ చేయటం కోసం బిడ్ నిర్వహించి.. అందులో అత్యధిక మొత్తాన్ని కోట్ చేసిన వారితో భోజనం చేస్తుంటారు. అలా వచ్చిన మొత్తాన్ని గ్లైడ్ ఫౌండేషన్ కోసం ఇస్తుంటారు. ఇంతకీ ఈ సంస్థ దేని కోసం పని చేస్తుందన్న విషయాన్ని చూస్తే.. శాన్ ఫ్రాన్సిస్కోలోని పేదలు.. ఇళ్లు లేని వారికి సాయం చేస్తుంటుంది.
మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ సంస్థను బఫెట్ సతీమణి 2000లో పరిచయం చేశారు. ఇది జరిగిన నాలుగేళ్లకు ఆమె మరణించారు. అయినప్పటికీ.. బఫెట్ మాత్రం ప్రతి ఏటా తన భార్య కోరినట్లుగా ఛారిటీ లంచ్ చేస్తున్నారు. తొలి బఫెట్ కోసం 2000లో 25వేల డాలర్ల బిడ్ నమోదైంది.
తాజాగా బిడ్ అత్యంత భారీదని చెప్పాలి. 88 ఏళ్ల బఫెట్ తో భోజనం కోసం రూ.31 కోట్లు చెల్లించేందుకు సిద్ధం కావటం ఇప్పుడు సంచలనంగా మారింది. మరింత ఖర్చు చేస్తున్న వ్యక్తి దీనిపై ఏమన్నాడంటే.. బఫెట్ తో బఫెట్ కు ఆ మాత్రం ఖర్చు పెద్ద విషయం కాదని తేల్చేశాడు. ఇదిలా ఉంటే.. బఫెట్ ఆలోచనలు మరోలా ఉన్నాయి. రానున్న యాభై ఏళ్లలో తాను అసోసియేట్ అయిన ఎన్జీవో భవిష్యత్తు ఎలా ఉండాలన్న దానిపై ఆయన ఆలోచిస్తున్నాడట.