Begin typing your search above and press return to search.
భారత్ రియాల్టీ రంగంలోకి అడుగుపెట్టనున్న వారెన్ బఫెట్
By: Tupaki Desk | 7 July 2021 5:32 AM GMTవారెన్ బఫ్ఫెట్..ప్రపంచంలోని మూడవ ధనవంతుడు. వారెన్ బఫ్ఫెట్ అత్యంత విజయవంతమైన పెట్టుబడిదారుడిగా గుర్తించబడ్డాడు. అతని సంస్థ, బెర్క్‌షైర్ హాత్వే కొన్నేళ్లుగా వాటాదారులకు అద్భుతమైన రాబడిని అందిస్తూ వస్తూంది. వారెన్ ఎడ్వర్డ్ బఫ్ఫెట్ ఆగష్టు 30, 1930 న జన్మించాడు. నెబ్రాస్కాలోని ఒమాహాలో హోవార్డ్ మరియు లీలా స్టాల్ బఫ్ఫెట్ కుటుంబం జన్మించాడు. అయన తన మొట్టమొదటి పెట్టుబడిని 11 ఏళ్లకే పెట్టి .. అభివృద్ధి వైపు అడుగులు వేశాడు. ఈ రోజు ప్రపంచంలోనే మూడో ధనవంతుడిగా కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే .. ఇన్వెస్ట్ మెంట్ కింగ్ వారెన్ బఫెట్ కు చెందిన రియాల్టీ బ్రోకరేజ్ బెర్క్ షైర్ హాత్ వే హోమ్ సర్వీసెస్ అతి త్వరలోనే భారత ప్రాపర్టీ మార్కెట్లోకి అడుగు పెడుతోంది.
బెర్క్ షైర్ హాత్ వే హోమ్ సర్వీసెస్ ఒరెండా ఇండియా పేరుతో హైదరాబాద్ సహా పలు ప్రముఖ నగరాల్లో కార్యకలాపాలు ప్రారంభించాలని ఇప్పటికే పలు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. భారత్ లో కార్యకలాపాల నిర్వహణ కోసం ఒరెండాతో జత కట్టింది. అందుకే బెర్క్ షైర్ హాత్ వే హోమ్ సర్వీసెస్ ఒరెండా ఇండియాతో సంయుక్తంగా కీలక రియాల్టీ మార్కెట్ సేవల్లోకి అడుగుపెట్టబోతుంది. బెర్క్‌షైర్ హాత్ వే హోమ్ సర్వీసెస్ ఒరెండా ఇండియా ప్రధానంగా ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, పుణే, అహ్మదాబాద్, గోవా, అయోధ్య తదితర కీలక ప్రాపర్టీ మార్కెట్ల పైన దృష్టి పెట్టింది. భారత రియాల్టీ రంగం గత ఏడాది గ్లోబల్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లను భారీగా ఆకర్షించింది. 2030 నాటికి 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. అలాగే, 2025 నాటికి భారత ఆర్థిక వ్యవస్థలో 13 శాతంగా ఉంటుందని భావిస్తున్నారు. బెర్క్‌షైర్ హాత్‌వే హోమ్ సర్వీసెస్‌ను భారత్‌లోకి తీసుకు రావడం ఆనందంగా ఉందని, ప్రపంచవ్యాప్తంగా తమ సేవలు మరింత విస్తరిస్తామని, ఇందులో భాగంగా భారత్ లోని ప్రధాన రియాల్టీ మార్కెట్ లో సేవలు అందిస్తామని బెర్క్ షైర్ హాత్ వే హోమ్ సర్వీసెస్ వెల్లడించింది. దాదాపుగా 1000 మందితో నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
ఇదిలా ఉంటే ఈ మద్యే ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ బెర్క్ షైర్ హాత్ వే వారసుడిని ప్రకటించారు. ఈ సంస్థ వైస్ చైర్మన్ గ్రెగ్ అబెల్ తన వారసుడిగా కొనసాగుతారని బఫెట్ వెల్లడించిన సంగతి తెలిసిందే. వారెన్ బఫెట్ వయస్సు ప్రస్తుతం 90 దాటింది. ఆయన తర్వాత కంపెనీకి వారసులు ఎవరనేది చాలామందిని వేధించిన ప్రశ్న. ఆ సమయంలోనే మే నెలలో తన స్థానాన్ని 58 ఏళ్ల గ్రెగ్ అబెల్ తో భర్తీ చేసేందుకు బోర్డు అంగీకారం తెలిపిందని వారెన్ బఫెట్ చెప్పారు. గత కొన్ని రోజుల నుండి వారసుడి పేర్లలో గ్రెగ్ పేరు వినిపిస్తోంది. కానీ వారసత్వ నిర్ణయాలను ఈ కంపెనీ రహస్యంగా అలాగే మెయిన్ టైన్ చేస్తుంది. తమ వద్ద ఇందుకు సంబంధించి పూర్తి ప్రణాళిక ఉందని గతంలోనే వెల్లడించింది. మరో వైస్ చైర్మన్ అజిత్ జైన్ ను కూడా ఇందుకు పరిశీలించినప్పటికీ, వయస్సు కీలకంగా మారిందని చెబుతున్నారు. గ్రెగ్, అజిత్ ఇద్దరూ అద్భుత వ్యక్తులని బఫెట్ తెలిపారు. వారెన్ బఫెట్ కు చెందిన బెర్క్‌షైర్ హాత్‌వే షేర్ ధర ఈ ఏడాది మే నెలలో భారీగా ఎగిసిపడింది. ఎంతలా అంటే నాస్ డాక్ కంప్యూటర్లు కూడా చూపించలేని గరిష్ట విలువకు అతి దగ్గరగా ఉంది. ఈ నేపథ్యంలో నాస్‌డాక్ కంప్యూటర్ సిస్టంను అప్ గ్రేడ్ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ కంపెనీ క్లాస్ ఏ షేర్ ధర 4,21,000 డాలర్లను మించింది. అయితే నాస్ డాక్ లో కంప్యూటర్లు చూపించే గలిగే గరిష్ట వ్యాల్యూ 4,294,967,295 డాలర్లు మాత్రమే.
బెర్క్‌షైర్ హాత్‌వే కార్యకలాపాలు ...
బెర్క్ షైర్ హాత్ వే అమెరికాలోని ఒమాహా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. పెద్ద కంపెనీల్లోనే పెట్టుబడులు పెడుతుంది. పలు సబ్సిడరీల ద్వారా దాదాపు 90 రకాల వ్యాపారాలు నిర్వహిస్తున్నది. అందులో ఒకటి హోం సర్వీసెస్. ఇది అమెరికా రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్‌ల్లో దిగ్గజం. ఈ సంస్థ ఇండ్ల కొనుగోళ్లు, అమ్మకాలు తదితర రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ సేవలతోపాటు తనఖా రుణాలు ఇప్పించటం, టైటిల్ ఇన్సూరెన్స్ ఎస్క్రో సేవలు, గృహ వారంటీలు, ఆస్తి బీమా, ప్రమాద బీమా సేవలను అందిస్తుంది.