Begin typing your search above and press return to search.
హైదరాబాద్‌లో బఫెట్ అడుగు
By: Tupaki Desk | 15 July 2021 7:30 AM GMTఅమెరికా బిజినెస్ మాగ్నెట్, ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన పెట్టుబడీదారుల్లో ఒకరైన వారెన్ బఫెట్ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం హైదరాబాద్‌లో అడుగుపెట్టబోతున్నారు.
ఆయన కంపెనీ బెర్క్‌షైర్ హాత్వే తన రియాల్టీ సంస్థను దేశంలోని ప్రముఖ నగరాలతో పాటు హైదరాబాద్‌లోనూ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బఫెట్ తన దృష్టిని భారత్ వైపు మళ్లించడం పైగా హైదరాబాద్‌లో వ్యాపారం చేయాలనుకోవడం విశేషం.
బెర్క్‌షైర్ హాత్వే హోమ్ సర్వీసెస్ (బీహెచ్‌హెచ్ఎస్) ఒరెండా ఇండియాతో కలిసి భారత్‌లో బెర్క్‌షైర్ హాత్వే హోమ్ సర్వీసెస్ ఒరెండా ఇండియాను ఏర్పాటు చేయనుంది.
దీని ద్వారా తన కార్యకలాపాలను కొనసాగించనుంది. బీహెచ్‌హెచ్ఎస్ రాక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి ఓ ప్రత్యేకతను కలిగించే అవకాశముంది.
ఈ కంపెనీ బ్రోకరేజీ చేసే ఓ ఏజెన్సీగా పనిచేయనుంది. ఆస్తులను కొనడం, అమ్మడంతో పాటు లీజుకు ఇవ్వడం, ప్రాజెక్టులు చేపట్టి అభివృద్ధి చేయడం, అభివృద్ధి నిర్వాహణ, ఆడిట్, మూలధన మార్కెట్, పెట్టుబడి బ్యాంకింగ్ తదితర కార్యకలాపాలను నిర్వర్తించనుంది.
బీహెచ్‌హెచ్ వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో 1500కు పైగా కన్సల్టెంట్లు, ఉద్యోగులతో కార్యాలయాలు ప్రారంభించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.
ఏజెన్సీతో పాటు అభివృద్ధి నిర్వహణలోనూ ఏకకాలంలో దూసుకెళ్లే దిశగా ఆ కంపెనీ అడుగులు వేస్తోంది. భారత రియల్ ఎస్టేట్ రంగం విలువ 1 ట్రిలియన్ అమెరికా డాలర్లను తాకుతుందనే అంచనాలున్నాయి.
ఈ నేపథ్యంలో బీహెచ్‌హెచ్ఎస్ దేశ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక పాత్ర పోషించే అవకాశముంది.