Begin typing your search above and press return to search.
హుజూర్ నగర్ లో పద్మావతి ఓటమికి కారణమిదేనా?
By: Tupaki Desk | 24 Oct 2019 9:31 AM GMTతొమ్మిది నెలల కిందటే హుజూర్ నగర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఆయన నల్గొండ ఎంపీగా పోటీచేయడం.. గెలవడం కూడా జరిగిపోయింది. దీంతో హుజూర్ నగర్ స్థానానికి రాజీనామా చేశారు. ఉప ఎన్నిక వచ్చింది. ఆయన భార్య పద్మావతియే అభ్యర్థిగా నిలబడింది.
అయితే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ చేసిన ఈ ప్రచారమే పద్మావతి కొంప ముంచిందన్న వాదన వినిపిస్తోంది. గత ఏడాది డిసెంబర్ 7న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడలో ఇదే పద్మావతి.. టీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు.
అయితే కోదాడలోని కొన్ని పోలింగ్ స్టేషన్లలో వేసిన ఓట్లను లెక్కించకుండానే ఈ ఫలితాన్ని ప్రకటించారని కాంగ్రెస్ తరుఫున కోదాడ అభ్యర్థిగా పోటీచేసి ఓడిన పద్మావతి కోర్టులో కేసు వేశారు. ఈ కేసు కోర్టులో నడుస్తోంది.
అయితే తాజాగా ఈ కేసులో పద్మావతి గెలుస్తుందనే ప్రచారం ఎక్కువైంది. దీన్నే ప్రచార అస్త్రంగా మలిచిన టీఆర్ఎస్ 'పద్మావతి కేసులో గెలిస్తే కోదాడ ఎమ్మెల్యే అవుతారని.. మళ్లీ హుజూర్ నగర్ లో కూడా గెలిస్తే మరోసారి ఉప ఎన్నిక వస్తుందని' టీఆర్ఎస్ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేశారట..
దీంతో పద్మావతికి పడే ఓటు కూడా పడలేదని సమాచారం. పద్మావతి కోర్టులో గెలిస్తే కోదాడ ఎమ్మెల్యే అవుతుందని.. ఇక్కడ ఓటు వేసి మళ్లీ ఉప ఎన్నికలు తెచ్చుకుంటారా అని టీఆర్ఎస్ శ్రేణులు హుజూర్ నగర్ నియోజకవర్గ ఓటర్లకు వివరిస్తూ చేసిన ప్రచారమే పద్మావతి కొంప ముంచిందన్న వాదన వినిపిస్తోంది.