Begin typing your search above and press return to search.

‘‘ఆనంది’’ గర్భవతా..?

By:  Tupaki Desk   |   4 April 2016 5:04 AM GMT
‘‘ఆనంది’’ గర్భవతా..?
X
ఆత్మహత్య చేసుకున్న చిన్నారి పెళ్లికూతురు ‘ఆనంది’ పాత్రధారి ప్రత్యూష బెనర్జీకి సంబంధించిన ఒక కొత్త విషయం బయటకు పొక్కింది. అధికారికంగా కాకున్నా.. ఆమె సన్నిహితులు చెబుతున్న మాటల్ని చూస్తే.. ప్రత్యూష రెండు నెలల గర్బవతిగా ఉహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. విషయాన్ని ఆమె పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వెల్లడి కాలేదు. ఆమె పోస్ట్ మార్టమ్ నివేదిక బయటకు రావటానికి నెల రోజులు పడుతుందని చెబుతున్నారు. అప్పుడు మాత్రమే ఆమె గర్భవతా? కాదా? అన్న విషయం బయటకు వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు.

నిజానికి ప్రత్యూష.. ఆమె బాయ్ ఫ్రెండ్ రాహుల్ ఇద్దరూ బెంగాలీల కొత్త సంవత్సరాది రోజైన ఈ ఏప్రిల్ 14న పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ విషయాన్ని వారిద్దరికి సంబంధించిన పలువురు స్నేహితులు పేర్కొనటం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఆమె గర్భవతి కూడా అన్న విషయంపై సందేహాలు వ్యక్తమవుతూ వార్తలు వస్తున్నాయి. అయితే.. ఇది నిజమా అన్నది వెల్లడి కావాల్సి ఉంది.

ఇదిలా ఉంటే.. ప్రత్యూషది సూసైడ్ కాదన్న వార్త బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె మరణానికి కారణంగా అనుమానిస్తున్న ఆమె బాయ్ ఫ్రెండ్ రాహుల్ తాజాగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఛాతీ నొప్పి.. బీపీతో అతన్ని ముంబయిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారని.. ప్రస్తుతం అతన్ని ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నట్లుగా చెబుతున్నారు. మరోవైపు ప్రత్యూషకు ఆర్థిక ఇబ్బందులు ఉండేవంటూ చెబుతున్న మాటకు తగ్గట్లే ఆమె బాయ్ ఫ్రెండ్ రాహుల్ తండ్రి హర్షవర్ధన్ మాట్లాడుతూ.. తాను ప్రత్యూషకు అప్పుడప్పుడు రూ.10వేలు చొప్పున పంపేవాడినని చెప్పటం గమనార్హం. నటన ద్వారా ఆమెకు వచ్చిన డబ్బులన్నీ ఏమైనట్లు..?