Begin typing your search above and press return to search.
సోనియమ్మ వైనంపై స్పీకర్ విస్మయం
By: Tupaki Desk | 16 Aug 2015 9:50 AM GMTకీలక స్థానాల్లో ఉన్న వారికి సంబంధించిన ప్రతి చర్యను సునిశితంగా గమనిస్తుంటారు. మొన్న ముగిసి పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా.. అధికార.. విపక్షాల మధ్య సుష్మా స్వరాజ్ అంశంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వెల్ లోకి దూసుకురావటంపై పలువురు విస్మయం వ్యక్తం చేయటం తెలిసిందే.
కాంగ్రెస్ అధినేత్రిగా ఉన్న ఆమె.. ఒక సామాన్య సభ్యురాలి మాదిరి.. పెద్ద కారణం లేకుండానే వెల్ లోకి దూసుకెళ్లిన తీరు సరికాదన్న భావన వ్యక్తమైంది. ఇదిలా ఉంటే.. తాజాగా సోనియాగాంధీ వెల్ లోకి దూసుకొచ్చిన విషయంపై లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేకాదు.. ఆమె అలా ఎందుకు దూసుకొచ్చారో తనకు అర్థం కాలేదని ఆమె వ్యాఖ్యానించారు.
సభ్యుల మధ్య నిరసనలు.. ఆందోళనలు.. నినాదాలు చోటు చేసుకున్న సమయంలో సంయమనం పాటించాల్సిన వ్యక్తే అలా వెల్ లోకి దూసుకురావటం పట్ల తాను షాక్ అయినట్లు ఆమె పేర్కొన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా ప్లకార్డులు ప్రదర్శించటం.. అన్ పార్లమెంటరీ పదాల్ని వినియోగించటం సరికాదన్న ఆమె.. వర్షాకాల సమావేశాల సందర్భంగా అధికార.. విపక్షాల మధ్య చోటు చేసుకున్న పలు ఘటనల సమయంలో ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు అన్నది తాను తేల్చుకోలేకపోయానని.. గందరగోళం చోటు చేసుకున్న సందర్భంలో తనను తాను నియంత్రించుకోవటానికి చాలానే కష్టపడాల్సి వచ్చిందని చెప్పారు.
స్పీకరమ్మకు కూడా అర్థం కాని విధంగా సోనియమ్మ ఎందుకు దూసుకొచ్చినట్లు..? అన్న దానిపై సోనియమ్మ మాత్రమే సమాధానం ఇస్తేనే బాగుంటుందేమో.