Begin typing your search above and press return to search.
పోలీసులు కొకైన్ కొన్నాక డెకాయ్ ఆపరేషన్ జరిగిందా?
By: Tupaki Desk | 16 April 2022 2:32 AM GMTబంజారాహిల్స్ లోని పుడింగ్ అండ్ మింక్ పబ్ లో డ్రగ్స్ వ్యవహారంలో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. పబ్ లో కొకైన్ అమ్మకాలు సాగుతున్న విషయాన్ని గుర్తించిన పోలీసులు.. అందుకు సంబంధించి పక్కా ప్లాన్ చేసినట్లుగా చెబుతున్నారు. అమ్మకాలు జరుగుతున్న సమాచారాన్ని అందుకున్న వారు.. వాటిని స్వయంగా కొనుగోలు చేసి.. అవి కొకైన్ అన్న విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే వారు రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది.
ఈ పబ్ తో పోలీసు ఉన్నతాధికారులకు సంబంధాలు ఉండటం.. ఈ పబ్ మీద గతంలో తనిఖీలు చేసేందుకు వెళ్లిన సమయంలో అధికారులు పలువురుకి చేదు అనుభవాలు ఎదురైన నేపథ్యంల.. అత్యున్నత స్థాయి అధికారికి విషయం తెలిసి స్వయంగా డెకాయ్ ఆపరేషన్ జరిపించినట్లుగా చెబుతున్నారు. ఇందుకోసం పక్కా ప్లాన్ చేసిన వారు.. ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్నట్లుగా చెబుతున్నారు.
మార్చి మొదటి వారాంతంలోజరిగిన ఈ డెకాయ్ ఆపరేషన్ పెను సంచలనంగా మారటమే కాదు.. ఈ ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనల్ని క్రియేట్ చేసింది. ఇక.. డెకాయ్ ఆపరేషన్ చేసేందుకు పోలీసు శాఖలో కొత్తగా రిక్రూట్ అయి.. డిపార్ట్ మెంట్లో పెద్దగా పరిచయం లేని వారిని ఎంపిక చేసుకున్నట్లు చెబుతున్నారు.
పబ్ లో కొకైన్ అమ్ముతున్న విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్న టాస్క్ ఫోర్సు పోలీసులు.. ముగ్గురు ఎస్ ఐలు.. మరో ముగ్గురు కానిస్టేబుళ్లను సివిల్ డ్రెస్ లో పంపారు.
పబ్ లోపలకు వెళ్లిన వారు డిన్నర్ చేయటంతో పాటు.. అక్కడే చాలాసేపు గడిపారు. ఈ క్రమంలో లోపల విషయాల్ని అర్థం చేసుకున్న వారు.. కొకైన్ కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా మిగిలిన వారు రహస్య కెమేరాలతో చిత్రీకరించి.. పబ్ లో కొకైన్ అమ్ముతున్న పక్కా సాక్ష్యాన్ని సేకరించినట్లుగా చెబుతున్నారు.
ఈ కారణంతోనే.. డెకాయ్ ఆపరేషన్ వేళలో.. కొకైన్ ఉన్న పాకెట్లను తేలిగ్గా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పబ్ లో కొకైన్ అమ్మే స్థాయి ఉన్నప్పుడు.. పోలీసుల తనిఖీల్లో మాత్రం కేవలం ఐదు గ్రాములు మాత్రమే దొరికినట్లుగా చెబుతున్నారు. అమ్మే చోట ఇంత తక్కువగా దొరకటం ఏమిటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.