Begin typing your search above and press return to search.
డీమోనిటైజేషన్ అమెరికా కుట్రా?
By: Tupaki Desk | 7 Jan 2017 7:05 AM GMTసరిగ్గా రెండు నెలల కిందట దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ నిర్ణయం ప్రకటించారు.. అప్పుడు ఆయన చెప్పిన కారణమేంటి...? నల్లధనం నిర్మూలన - దొంగ నోట్లను అరికట్టడం.. అవినీతికి అడ్డుకట్ట వేయడం.. ఆ తరువాత క్రమంగా దానికి క్యాష్ లెస్ ఎకానమీ టార్గెట్ కూడా చేర్చారు. మొత్తానికి ఒక్క మాటలో చెప్పాలంటే దేశాన్ని బాగు చేసేందుకు ఈ పనిచేసినట్లు ప్రభుత్వం చెప్పింది. దాంతో విపక్షాలు కూడా గట్టిగా ఏమీ అనలేకపోయాయి.. డబ్బు కోసం ఏటీఎంలు - బ్యాంకుల వద్ద గంటలు గంటల నిల్చున్న ప్రజలు కూడా దాన్ని దేశభక్తి చాటుకోవడంగానే ఫీలవ్వాల్సి వచ్చింది. లేదంటే... సినిమా టిక్కెట్లకు.. షాపింగ్ మాల్ లో బిల్లింగుకు గంటల పాటు లైన్లో నిల్చుంటారు కానీ దేశం కోసం నిల్చోలేరా అని ఫేస్ బుక్ - ట్విట్టర్ - వాట్సాప్ లలో ప్రశ్నించేవారు ఎక్కువయ్యారు. మొత్తానికి డీమానిటైజేషన్ ఇష్యూలోకి దేశభక్తిని పెనెట్రేట్ చేశారు. అయితే.. పెద్ద నోట్ల రద్దు వెనుక అసలు కారణం వేరట... అసలు ఆ దిశగా మోడీని నడిపించింది కూడా మనవాళ్లు కారట... దీని వెనుక పెద్ద కుట్ర కూడా ఉందట.. ఈ రహస్యాలన్నీ ఏషియన్ పసిఫిక్ రిసెర్చ్ (ఏపీఆర్) సంస్థ బయటపెట్టింది.
నల్లధనం పేరుతో మోడీ దేశ ప్రజలను ఎలా పిచ్చోళ్లను చేసి ఆడుకున్నారన్నది ఏపీఆర్ సంస్థ నివేదిక చెప్పుకొచ్చింది. ప్రపంచ ఆర్దికవ్యవస్థను తన చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు అమెరికా వేసిన విషప్రయోగానికి భారత్ బలైందని అందులో సూత్రీకరించారు. ‘‘ఎ వెల్ కెప్ట్ సీక్రెట్’ అంటూ విడుదల చేసిన ఈ రిపోర్ట్ ప్రకారం.. ఇప్పటికే ఆయుధ వ్యాపారంలో ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికా ప్రపంచ ఆర్థిక రంగాన్ని తన ఆధీనంలో పెట్టుకునేందుకు ఎత్తు వేసింది. ఇందులో భాగంగా అమెరికా ప్రభుత్వానికి చెందిన యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్‌నేషనల్ డెవలప్ మెంట్ (యుఎస్ ఎఐడీ) రంగంలోకి దిగింది. ప్రపంచాన్ని నగదు రహితంగా మార్చి … ఆన్ లైన్ ద్వారా మొత్తం ప్రపంచ ఆర్దిక వ్యవస్థను వాషింగ్టన్ లో కూర్చుని నిఘా ఉంచాలన్నది యూఎస్ ఏఐడీ ఎత్తుగడ. ఇందులో భాగంగా తొలుత ఇండియాపై కన్నేసింది. అనుకున్నదే తడవుగా ఏడాది క్రితం నుంచే ఆర్బీఐ అధికారులు - భారత ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరిపింది. ఇందుకోసం ఒబామా - మోడీ మధ్య సంబంధాలను కూడా యూఎస్ చక్కగా వాడుకుంది. నగదు రహిత సమాజం పేరుతో భారత్ ను ముగ్గులోకి దింపింది. తొలుత ఒక నగరాన్ని క్యాష్ లెస్ కోసం ఎంపిక చేసి ప్రయోగం చేయాలనుకున్నారట. కానీ భారతీయుల దేశభక్తి - అమాయకత్వాన్ని గమనించి ఏకంగా ఒక్కసారిగా దేశం మొత్తం మీద ప్రయోగాన్ని చేసినట్టు ఏపీఆర్ రిపోర్టు చెబుతోంది.
పెద్దనోట్లను రాత్రికి రాత్రి రద్దు చేసి జనాన్ని బలవంతంగా క్యాష్ లెస్ ఎకానమీలోకి మళ్లించాలన్న దారుణ ప్రయోగం వెనుక వాషింగ్టన్ ఉందట. ఈ దారుణ ప్రయోగం వెనుక అమెరికా - భారత్ పెద్దలతో పాటు 35 కార్పొరేట్ కంపెనీలు కూడా పనిచేసినట్టు రిపోర్ట్ వెల్లడించింది. ఈ ప్రయోగం వల్ల అమెరికాకు - కార్పొరేట్ సంస్థలకు ఏం లాభమన్న దానికి కూడా ఆసియన్ పసిఫిక్ రిసెర్చ్ సంస్థ సమాధానం చెప్పింది. నోట్ల రద్దుతో సామాన్యుల బతుకులు చిద్రం అయినప్పటికీ డిజిటల్ పేమెంట్ సర్వీసుల్లో ఉన్న వీసా - మాస్టర్ కార్డ్ - పేటీఎం వంటి సంస్థలకు భారీగా లాభాలు వస్తాయి. అన్నింటికి మించి అమెరికా అత్యంత ప్రమాదకరమైన ఆలోచన ఇందులో ఉంది. ఐటి - ఐటి ఆధారిత పేమెంట్ సర్వీసుల్లోని తమ కంపెనీల వ్యాపారాలను విస్తరిస్తూ, అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థలను పూర్తిగా డిజిటల్ చెల్లింపుల పరిధిలోకి తేగలిగితే అమెరికా కంపెనీల బిజినెస్ పెరుగుతుంది. అదే సమయంలో వాషింగ్టన్ లో కూర్చొని, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక లావాదేవీలపై నిఘా వేసేందుకు అమెరికాకు వీలవుతుంది. తొలుత నల్లధనం నిర్మూలన కోసమే నోట్ల రద్దు అని చెప్పిన మోదీ… ఇప్పుడు క్యాష్ లెస్ పల్లవి అందుకోవడం కూడా ఏపీఆర్ రిపోర్టు చెప్పిన విషయాలకు బలాన్ని చేకూరుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/