Begin typing your search above and press return to search.

కుక్కకాటుకే కాదు... ఒబామాకూ 'చెప్పుదెబ్బ'!

By:  Tupaki Desk   |   21 Jan 2015 6:25 AM GMT
కుక్కకాటుకే కాదు... ఒబామాకూ చెప్పుదెబ్బ!
X
ఈ రోజుల్లో మంచిగా చెబితే ఎవరూ వినడం లేదు అనడంలో సందేహం లేదు! అది అమెరికా అయినా, పాకిస్థాన్‌ అయినా! భారతదేశం మొత్తం జాతిపితగా పిలుచుకునే మహాత్మాగాంధీ బొమ్మను బీరు బాటిళ్లపై ముద్రించి 120 కోట్ల మంది భారతీయుల మనోభావాలు దెబ్బతీసిన అమెరికన్‌ కంపెనీ పై విమర్శలు, నిరసనలు ఎన్నో వెల్లువెత్తాయి! అయినా కూడా ఆ దేశ నాయకులు, చట్టాలు స్పందించలేదు! దీంతో స్వయంగా ఆ అమెరికా అధ్యక్షుడికే గుణపాఠం చెప్పేందుకు భారతదేశపు కంపెనీ ఒకటి సిద్ధమయ్యింది! కుక్క కాటుకే కాదు, అగౌరవ కాటుకి, అమర్యాద చేతకి కూడా చెప్పుదెబ్బే సరి అని కేరళకు చెందిన ఒక కంపెనీ నిర్ణయించింది! అమెరికా తొలి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్‌ ఫోటోలతో చెప్పులను తయారు చేసింది!

ఈ క్రమంలో మొత్తం 100 జతల జార్జి వాషింగ్టన్‌ ఫోటో ముద్రించిన స్లిప్పర్స్‌ను రిపబ్లిక్‌ డే వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరవుతున్న అమెరికా అధ్యక్షుడు ఒబామాకు తెలిసి వచ్చేలా వీటిని ఢిల్లీలోని యూఎస్‌ ఎంబసీ ముందు ప్రదర్శించాలని నిర్ణయించింది! అంతేకాదు అమెరికాకు చెందిన ప్రముఖులకు వీటిని పంపాలని కూడా భావిస్తున్నారట! అమెరికా అధ్యక్ష భవనానికి ఓ జత, ఆదేశ ఉపాధ్యక్షుడు, పార్లమెంట్‌ స్పీకర్‌, చీఫ్‌ జస్టిస్‌, అమెరికా విపక్ష నేతకు అలాగే యూఎస్‌లోని 50 రాష్ట్రాల గవర్నర్‌లకు తలా ఒక జత చొప్పున వాషింగ్టన్‌ స్లిప్పర్స్‌ని కొరియర్‌ చేస్తామని కేరళ ఫుట్‌వేర్‌ కంపెనీ నిర్వాహకులు చెబుతోన్నారట!

భారతీయుల మనోభావాలు దెబ్బతీసిన అమెరికాకు చెప్పుదెబ్బలాంటి గుణపాఠం చెప్పాలన్నదే తమ అభిమతమని నిర్వాహకులు అంటున్నారు! ఈ సాహసం, ఇటువంటి ఆలోచనలు పాక్‌ విషయంలో భారత్‌ కూడా శాంతి మార్గాలను పక్కనపెట్టి, కుక్క కాటుకి చెప్పు దెబ్బ తరహాలో వెళ్లాలని ప్రజలు కోరుకుంటోన్నారు! ఏది ఏమైనా... ఈ సారి ఒబామా కు మోడీ కంటే ముందు కేరళ కంపెనీయే ఘనమైన ఆహ్వానం ఏర్పాటు చేసిందన్నమాట!