Begin typing your search above and press return to search.

వసీం అక్రమ్ ను ఘోరంగా అవమానించారు..

By:  Tupaki Desk   |   24 July 2019 7:26 AM GMT
వసీం అక్రమ్ ను ఘోరంగా అవమానించారు..
X
పాకిస్తాన్ మాజీ క్రికెట్ కెప్టెన్, సీనియర్ మాజీ క్రికెటర్ అయిన వసీం అక్రమ్ కు ఘోర అవమానం ఎదురైంది. తాజాగా జరిగిన ప్రపంచకప్ లో వ్యాఖ్యతగా వసీం అక్రమ్ వ్యవహరించారు. వసీం ఇది వరకు చాలా దేశాల్లో పర్యటించినా ఆయన వరల్డ్ ఫేమస్ కావడంతో మర్యాద దక్కేది. కానీ ఇంగ్లండ్ నుంచి క్రికెట్ ప్రపంచకప్ ముగిశాక వస్తుండగా మంచేస్టర్ విమానాశ్రయ సిబ్బంది వసీంను ఘోరంగా అవమానించారు.

తాజాగా వసీం అక్రమ్ ట్వీట్ చేశారు. మాంచేస్టర్ విమానాశ్రయంలో తనను ఘోరంగా అవమానించారని ట్విట్టర్ లో వాపోయాడు. తనకు షుగర్ వ్యాధికి సంబంధించిన ఇన్సులిన్ కిట్ విషయంలో సిబ్బంది అమర్యాదగా మాట్లాడుతూ గట్టిగా అరిచారని ఆవేదన వ్యక్తం చేశారు.

వసీం అక్రమ్ షుగర్ వ్యాధితో చాలా రోజులుగా బాధపడుతున్నాడు. ఎప్పుడూ తన వెంట ఇన్సులిన్ ఇంజెక్షన్లను వెంట ఒక ప్రత్యేకమైన పౌచ్ లో తీసుకెళ్తుంటాడు. ఇంగ్లండ్ కు కూడా అలానే వెళ్లాడు. అయితే తిరిగి వస్తుండగా అది భద్రతా కారణాల రీత్యా ఆ ఇన్సులిన్ పౌచ్ ఎందుకు తెచ్చారని వసీంను విమానయాన సిబ్బంది గట్టిగా అరిచి అవమానించారు. ఆ ఇన్సులిన్ పౌచ్ ను ప్లాస్టిక్ సంచిలో వేసి భద్రపరిచారు.

కాగా వసీం ట్విట్టర్ లో ఆవేదన చెందడంపై మాంచెస్టర్ విమానయాన సంస్థ స్పందించింది. దీనిపై విచారణ చేపడుతామని తెలిపారు. నేరుగా ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.