Begin typing your search above and press return to search.
కేంద్రం బాధ్యతను వదిలేసిందా ?
By: Tupaki Desk | 4 Sep 2022 4:47 AM GMT'నదీజలాల పంపిణీ వివాదాలకు ఉమ్మడి పరిష్కార మార్గాలను అన్వేషించాలి' ఇది తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రాలకు చేసిన సూచన. జలవివాదాలు లేదా ఇతరత్రా ఏ సమస్య తలెత్తినా రాష్ట్రాల మధ్య పరిష్కారం కాకపోతే అప్పుడు కేంద్రప్రభుత్వం ఏం చేస్తుంది ? జోక్యం చేసుకోకుండా చోద్యం చూస్తుంటుందన్నట్లుగా ఉంది అమిత్ షా చేసిన వ్యాఖ్యలు. రాష్ట్రాల మధ్య వివాదాలు పరిష్కారమయ్యేట్లుగా ఉంటే ఇక కేంద్రంతో పనేముంది ?
ఏ వివాదమైనా రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాకపోయినపుడు కచ్చితంగా కేంద్రం జోక్యం చేసుకుని పరిష్కరించాల్సిందే. అయితే తన బాధ్యత నుండి కేంద్రం తప్పించుకున్నది. ఏపీ- తెలంగాణా, తమిళనాడు-కర్ణాటక, తమిళనాడు-కేరళ, తెలంగాణ - మహారాష్ట్ర మధ్య జల వివాదాలు పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. దశాబ్దాలు గడిచినా ఈ వివాదాలు పరిష్కారం కావటం లేదు. వీటిల్లో ఏ ఒక్క వివాదాన్ని కూడా కేంద్రం పరిష్కరించలేదు.
జల వివాదాలను పక్కన పెట్టేస్తే తెలంగాణా-ఏపీ మధ్య విభజన పరిష్కారాలు ఎనిమిదేళ్లుగా అపరిష్కృతంగానే ఉండిపోయాయి. వివాదాల పరిష్కారానికి తెలంగాణా ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం ఎంత మొత్తుకుంటున్నా ఉపయోగం కనబడటం లేదు. మరీ సమస్యలు ఎప్పటికి పరిష్కారం కావాలి ? వివాదం ఏదైనా రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాకపోతేనే కేంద్రం జోక్యాన్ని కోరుతాయి. అప్పుడు కూడా వివాదాన్ని రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని చెబితే ఇక కేంద్రం ఉన్నదెందుకు ?
ప్రస్తుతం వాతావరణంలో జరుగుతున్న మార్పులు తదితరాల వల్ల వర్షాలు సక్రమంగా కురవడం లేదు. ఉంటే అతివృష్టి లేదా అనావృష్టి. ఇలాంటి పరిస్థితుల వల్లే జలవివాదాలు పెరిగిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల సంకుచిత ధోరణుల వల్లకూడా వివాదాలు పరిష్కారం కావటం లేదు. పక్క రాష్ట్రం ఎలాపోయినా పర్వాలేదు తమ రాష్ట్రం బాగుపడితే చాలన్న ఆలోచనా ధోరణుల వల్లే వివాదాలు పెరిగిపోతున్నాయి. కర్నాటక-తమిళనాడు మధ్య కావేరి జల వివాదంలో న్యాయస్ధానం తీర్పిచ్చినా దాన్నిపాటించేందుకు కర్నాటక ప్రభుత్వం అంగీకరించని విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటపుడే కేంద్రం జోక్యం అవసరమవుతుంది. ఇపుడు కూడా మీరే పరిష్కరించుకోమని అమిత్ షా సలహా ఇవ్వటమే విచిత్రంగా ఉంది.