Begin typing your search above and press return to search.

కేరళ, తమిళనాడు మధ్య జల జగడం: తమ రాష్ట్ర ప్రజలకి ఆ నటుల మద్దతు

By:  Tupaki Desk   |   27 Oct 2021 5:44 AM GMT
కేరళ, తమిళనాడు మధ్య  జల జగడం: తమ రాష్ట్ర ప్రజలకి ఆ నటుల మద్దతు
X
ముల్లైపెరియారు డ్యాం విషయంలో కేరళ, తమిళనాడు మధ్య ఎన్నోసార్లు వివాదాలు వచ్చాయి. ముల్లైపెరియారు డ్యాం భద్రత పై ఆందోళనలు, నీటి మట్టం స్థాయి విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలు వీటికి కారణాలుగా మారాయి.1979లో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకోవడం వల్ల డ్యాంలో నీటి లీకేజీ సమస్య బయటపడింది. దీనితో వివాదం పురుడు పోసుకుంది. ఆ తర్వాత ఆనకట్ట ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ పెరుమెడు ఎమ్మెల్యే సీఏ కురియన్ వండి పెరియార్లో నిరాహార దీక్ష చేశారు. ఆపై 1979 నవంబర్ 25న సెంట్రల్ వాటర్ కమిషన్ డ్యాంను పరిశీలించింది. నీటి మట్టాన్ని 136 అడుగులకు తగ్గించాలని, ఆనకట్టను పునరుద్ధరించేందుకు స్వల్ప, దీర్ఘకాల చర్యలు చేపట్టాలని సీడబ్ల్యూసీ సూచించింది.

కమిషన్ ఆదేశాల ప్రకారం పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. డ్యాం స్పిల్ వేలను 10 నుంచి 13కు పెంచారు. ఆనకట్ట పనులు పూర్తయిన తర్వాత నీటి మట్టాన్ని ఇంతకుముందున్న 152 అడుగుల స్థాయికి పెంచాలని తమిళనాడు డిమాండ్ చేసింది. భద్రతా సమస్యలు సహా వివాదం కోర్టులో ఉందన్న కారణాలు చూపి తమిళనాడు డిమాండ్ ను కేరళ వ్యతిరేకిస్తోంది.ఈ వివాదం మొదట కేరళ, తమిళనాడు రాష్ట్రాల హైకోర్టులలో సాగింది. ఈ కేసులను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని అత్యున్నత ధర్మాసనాన్ని తమిళనాడు అభ్యర్థించింది. ప్రస్తుతం ఈ వివాదం సుప్రీంకోర్టులో ఉంది. అయితే ఈ నీటి రగడ పై ఇప్పుడు సినీ ప్రముఖుల మద్దతుతో కీలక మలుపు తీసుకుంది.

ముల్లైపెరియారు డ్యామ్ నీటి కోసం కేరళ ప్రజలు చేస్తున్న నిరసనలకు, కేరళ ప్రజలకు మద్దతు మలయాళ సినీ ప్రముఖులు తమ మద్దతు తెలిపారు. దీనితో మలయాళ నటులకు వ్యతిరేకంగా తమిళనాడు లో నిరసనలకి దిగారు. దీనితో పాటుగా తమ రాష్ట్రంలో మలయాళ నటులు నటించిన సినిమాల విడుదలను అడ్డుకుంటామని తమిళ సంఘాలు హెచ్చరికలు జారీ చేశాయి. డ్యామ్ లో 142 అడుగుల వరకు నీటిని నిలువ చేయాలనీ తమిళనాడు సర్కార్ వాదన . డ్యాం ప్రస్తుత పరిస్థితిని బట్టి 136 అడుగుల వరకే నీటిని నిలువ చేయాలని కేరళ సర్కార్ వాదన. ముల్లైపెరియారు డ్యాం నాణ్యత పూర్తిగా తగ్గిపోయిందని సమీపం లో మరో డాం నిర్మించాలని కేరళ సర్కార్ ప్రయత్నిస్తోంది. కొత్త డ్యామ్ నిర్మిస్తే తమిళనాడు కి పూర్తిగా అందవలసిన నీటిని కోల్పోయే అవకాశముందని ఆ రాష్ట్ర సర్కార్ వాదిస్తోంది.

ఈ డ్యాం విషయంలో కేరళ ప్రజలు చేస్తున్న నిరసనలకు మద్దతు తెలుపుతూ .. మలయాళ సినీ నటులు , పృథ్విరాజ్, ఉన్నిముకుంద్ తో సహా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదిక గా విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే డ్యామ్ నీటి విలువ 136 అడుగులకే పరిమితం చేస్తే తమిళనాడు లోని మదురై , దిండిగల్, తేని , రామనాథపురం జిల్లాలో పూర్తిగా రైతులు నష్టపోయే అవకాశం ఉంది. దీనితో మలయాళ నటులకి వ్యతిరేకం గా తమిళనాడు లోని తేని జిల్లాలో ప్రదర్శనలు చేస్తున్నారు. అంతేకాదు పృథ్విరాజ్, ఉన్నిముకుంద్, తో సహా అందరూ తమిళనాడు ప్రజలకు క్షమాపణ చెప్పాలని లేని పక్షం లో వారి సినిమా విడుదలను అడ్డుకుంటామని చెప్తున్నారు. కేరళ ఇడుక్కి జిల్లాలో ఉన్న ముల్లపెరియార్ ఆనకట్ట 125 వసంతాలు పూర్తి చేసుకొని ఇప్పటికి చెక్కు చెదరకుండా ఉండటం విశేషం.