Begin typing your search above and press return to search.
విమానంలో వాటర్ లీకేజ్..వీడియో వైరల్
By: Tupaki Desk | 1 July 2017 5:38 PM GMTసహజంగా పూరి గుడెసెల్లోనో పాత ఇళ్లల్లోనో నీరు కారడం చూస్తుంటాం. కొన్ని సందర్భాల్లో బస్సుల్లో ఇలాంటి ఇబ్బంది ఎదురవుతుంది. కానీ విమానంలో ఇలాంటి సమస్య వస్తుందా? చాన్సే లేదు....విమానం ఎంత పకడ్బందీగా ఉంటుందో తెలుసా అంటారా? మీ అభిప్రాయం నిజమే అయితే ఇక్కడ అంతకంటే నిజమైన ఉదంతం వీడియో ఆధారంగా మీ దృష్టికి తీసుకువస్తున్నాం. అది ఎక్కడ జరిగిందో తెలుసా... అగ్రరాజ్యం అమెరికాకు చెందిన విమానంలో!
అమెరికాకు చెందిన డెల్టా ఎయిర్ లైన్స్ లో అట్లాంటా నుంచి ఫ్లోరిడాకు వెళ్లేందుకు టామ్ మెక్ కల్లాఫ్ అనే ప్రయాణికుడు కుటుంబంతో సహా విమానం ఎక్కాడు. అయితే విమానంలో కూర్చున్నది మొదలు ఫ్లైట్ రూప్ టాప్ లో నుంచి నీరు కారడం మొదలయింది. దీంతో షాక్ తిన్న టామ్ తన సీటు ఎదురుగా ఉన్న ఓ మ్యాగజైన్ ను అడ్డుపెట్టుకున్నాడు. అయినప్పటికీ నీరు కారడం ఆగకపోవడంతో మరో మ్యాగజైన్ తో రక్షణ కల్పించుకున్నాడు. ఈ తతంగాన్ని టామ్ తనయుడు వీడియో తీసి పోస్ట్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైరల్ అయింది. ఇలా నీరు కారిపోతుండటాన్ని తాము మొదటే గుర్తించామని అయినప్పటికీ తమకు సరైన సీట్లను డెల్టా ఎయిర్ లైన్స్ సిబ్బంది కల్పించలేదని టామ్ అసహనం వ్యక్తం చేశారు. ఫ్లోరిడా చేరేవరకు రెండు మేగజైన్లను అడ్డుగా పెట్టుకుని తనపై పడుతున్న నీటిని పక్కకు దారి మళ్లించానని టామ్ వాపోయాడు. తనతోపాటు మరో ఆరుగురు ప్రయాణికులు జర్నీ మొత్తంగా ఈ పాట్లు పడ్డారని ఆయన వ్యాఖ్యానించాడు.
టామ్ ఇబ్బందిపై డెల్టా ఎయిర్ లైన్స్ టేక్ ఇట్ ఈజీగా రియాక్ట్ అయిందట. ఈ ఇబ్బందికి 100 అమెరికన్ డాలర్లు పరిహారంగా చెల్లిస్తామని తమకు సదరు విమానయాన సంస్థ ఆఫర్ ఇచ్చిందని టామ్ వివరించాడు. తాము 1800 డాలర్ల టికెట్ పెట్టుకొని ప్రయాణిస్తే ప్రయాణం మొత్తం తమను ఇబ్బందిపాలు చేసిన డెల్టా ఎయిర్ లైన్స్ ఇందుకు పశ్చాత్తాపం కూడా తెలపకుండా కేవలం 100 డాలర్లు ఇస్తాననడం చిత్రంగా ఉందని టామ్ మండిపడ్డాడు. కాగా, ఈ వీడియో వైరల్ అయింది. డెల్టా ఎయిర్ లైన్స్ వ్యవహారంపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/